Breaking News

మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! 

Published on Mon, 03/04/2024 - 12:47

మెడ ఎందుకు పట్టేస్తుందో, భరించలేని నొప్పి ఎందుకు వస్తుందో ఒక్కోసారి సరిగ్గా గుర్తించలేం. రోజంతా టీవీ చూడటం, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లు వాడకం,  గంటల తరబడి స్మార్ట్‌  ఫోన్‌ను చూస్తూ ఉండటంవల్లగానీ,  వ్యాయామం చేస్తున్నప్పుడు గానీ,  రాత్రిపూట  నిద్ర పోయేటపుడు  భంగిమలో తేడా తదితర కారణాలతో  మెడ నొప్పి బాధిస్తుంది.  


♦ నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్‌ ప్యాక్‌ లేదే చల్లని నీటిలో నింపిన క్లాత్‌ ను వేసి అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతోపాటు హీట్‌  ప్యాక్‌ ను ఉపయోగించవచ్చు. ఇది కూడా మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. 

♦  మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది.

♦  మసాజ్‌ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు జరుగుతోంది. మెడ నొప్పిని నివారించేందుకు మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు.

♦ కొన్ని రకాల యోగా ద్వారా కూడా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా క్లాక్‌ వైజ్‌,యాంటి క్లాక్‌వైజ్ దిశలో మెడను మెల్లిగా  సున్నాలాగా చుడుతూ చేసే వ్యాయామం  మంచి ఫలితాలనిస్తుంది.   ‍ 

♦ మొబైల్ ఫోన్‌ల వల్ల వచ్చే నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఆక్యుపంక్చర్ థెరపీ ద్వారా ఉపశమనం పొందవచ్చు.

చాలా సందర్భాలలో, నొప్పికి కారణం తెలియదు. దానికదే మెల్లిగా నెమ్మదిస్తుంది.  కొన్నిసార్లు ఇది వారం లేదా రెండు వారాల్లో తగ్గుతుంది. చిట్కాలతో కూడా మెడనొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. మూడు నెలల కంటే ఎక్కువ కాలంపాటు వేధించే మెడ నొప్పికి అంతర్లీనంగా మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)