Breaking News

పచ్చి క్యాబేజ్‌ సలాడ్‌లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Thu, 05/29/2025 - 12:16

ఇటీవల కాలంలో అందిరిలోనూ ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉంచుకునే యత్రం చేస్తున్నారు. అందులో భాగంగా మార్నింగ్‌ సమయంలో పచ్చి కూరగాయ సలాడ్‌లు, స్మూతీలు వంటివి తీసుకుంటున్నారు. అలానే ఇక్కడొక మహిళ బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా సలాడ్‌లు తీసుకునేది. ఆ తర్వాత కొద్దిరోజులకే అనారోగ్య పాలైంది. ఆమె ఎందికిలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని..పరీక్షించగా అసలు విషయం తెలిసి వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు దయ చేసి పచ్చి కూరగాయలు తినేందుకు ప్రయత్నించొద్దని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అలా పచ్చిగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి సవివరంగా వెల్లడించారు. మరీ అవేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

35 ఏళ్ల మహిళ తరుచుగా తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నానంటూ ఆస్పత్రికి వచ్చింది. బరువు తగ్గే క్రమంలో స్ట్రిక్ట​డైట్‌ ఫాలో అయ్యి ఇలా ఇబ్బంది పడుతుందా అనే దిశగా ఆ మహిళను విచారించారు. అయితే ఆ మహిళ స్ప్రుహతప్పి పడిపోవడం, మూర్చ వంటి పలు సమస్యలను ఎదుర్కొనడంతో రక్త పరీక్షలు వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమె మెదులో గాయంతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దానికి కారణమేంటని..చూసిన వైద్యుడి ఆరోగ్య చరిత్రలో తలకు గాయమైన దాఖాలాలు లేవు. దీంతో ఆమె ప్రతి రోజు ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటారని ప్రశ్నించగా..ఆమె పచ్చి క్యాబేజీ, పాలకూర వంటి కూరగాయలను తీసుకుంటానని చెప్పింది. దీని కారణంగానే ఆమె బ్రెయిన్‌ సిస్ట్‌తో బాధపడుతుందని వైద్యులు నిర్థారణకు వచ్చి ఆమె ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. 

ఇలా జరగడానికి కారణం..
ఈ పరిస్థితిని న్యూరోసిస్టిసెర్కోసిస్‌ లేదా బ్రెయిన్‌ వార్మ్‌ అని పిలుస్తారు. దీనికారణంగా పిల్లలు, పెద్దలు తరుచుగా మూర్చ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మరీ ఈ మహిళ ఈ పరిస్థితి బారిన పడటానికి ప్రధాన కారణం బ్రేక్‌ ఫాస్ట్‌గా సలాడ్‌లో తీసుకునే పచ్చి కాయగూరలేనని చెప్పారు. పచ్చి కాయగూరలు తీసుకోవడం మంచిది కాదా..? అంటే..ముమ్మాటికి మంచిది కాదనే అంటున్నారు వైద్యులు. వీటిల్లో బద్దె పురుగులు(టేప్‌వార్మ్ ) ఉంటాయట. 

మన నీటితో చక్కగా వాష్‌ చేశాం అనుకుంటాం గానీ.. అవి ఆకు మడతల్లో ఉండిపోతాయి. అంటే వాటికి సంబంధించిన లార్వాలు వంటివి పచ్చి కూరగాయల్లో ఉండిపోతాయట. ఎప్పుడైతే సలాడ్‌ పేరుతో పచ్చిగా తింటామో అవి నేరుగా మన కడుపులోకి నేరుగా వెళ్లిపోతాయి. దీంతో బ్రెయిన్‌ సిస్ట్‌ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. 

మనం ఇలా పచ్చి కూరగాయలు తినగానే ఆ టేప్‌వార్మ్‌ సంబంధిత లార్వాలు రక్తప్రవాహంలోకి వెళ్లి..అక్కడ నుంచి మెదడు ప్రయాణించి తిత్తులుగా ఏర్పడతాయన్నారు. అంటే వాపు లేదా ద్రవం రూపంలో పేరుకుపోతాయట. దీంతో సదరు వ్యక్తికి తర్చుగా మూర్చలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

చికిత్స..
యాంటీబయాటిక్‌, స్టిరాయిడ్‌లతో ఈ సమస్యను నివారిస్తామని తెలిపారు వైద్యులు. అయితే ఒక్కోసారి ఈ లార్వా గనుక చనిపోయినా..సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని అన్నారు. 

బాధితుడు తలనొప్పి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకుండా..సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే..ఈ సమస్య నుంచి త్వరితగతిని బయటపడగలరని చెప్పారు. అలాగే ఒక్కోసారి ఈ టేప్‌ వార్మ్‌ లార్వా ప్రేగులలో కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. తద్వారా చేతులు, కాళ్లలో వాపు వంటి సమస్యలు వస్తాయట.

క్యాబేజీలోనే ఎక్కువ..!
క్యాబేజీ బ్యాక్టీరియాకు నిలయమా..? అంటే..అది పెరిగే నేల, కడగడానికి ఉపయోగించే నీరు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే క్యాబేజ్‌ని నీటితో వాష్‌ చేసినప్పటికీ టేప్‌ వార్మ్‌ లార్వాలు ఆకుమడతల్లో ఉండిపోతాయి. 

అందువల్ల వీటిని వేడినీటిలో కొద్దిసేపు ఉడికించి.. సలాడ్‌గా తీసుకుంటే ప్రమాదం ఉండదని చెబుతున్నారు వైద్యుల. ఈ టేప్‌ వార్మ్‌ లార్వాలు తక్కువ ఉడికించే కూరగాయలు, మాంసంలో అలానే ఉండిపోతాయట. అందుకని తగు మోతాదులో ఉడికిస్తే ఎటువంటి సమయం ఉండదని చెబుతున్నారు నిపుణులు.  

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: పెళ్లి బరాత్‌తో దద్దరిల్లిన వాల్‌స్ట్రీట్‌..! వీడియో వైరల్‌)
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)