Breaking News

బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్‌ వల్ల..

Published on Sat, 07/08/2023 - 08:50

ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చిటపటా చినుకులు పడుతున్నాయి. రుతు సంధి కారణంగా అంటే సీజనల్‌ మార్పుల వల్ల ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో బీట్‌రూట్‌  ఉత్తమమైనది.

ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌తో తయారు చేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 



బీట్‌రూట్‌లో ఏయే పోషకాలుంటాయి?
బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో ఫోలేట్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

  • బీట్‌రూట్‌లో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తహీనత, రోగ నిరోధక శక్తి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
  • బీట్‌రూట్‌లో అధిక మోతాదులో లభించే నైట్రేట్‌ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలో గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.
  • కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌ శరీరంలో శక్తి స్థాయులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. 
  • బీట్‌రూట్‌ ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్‌ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
  • బీట్‌రూట్‌ రసాన్ని తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బీట్‌రూట్‌ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

(చదవండి: ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం! చక్కటి నిగారింపు మీ సొంతం)                                              

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)