Breaking News

Dusting challenge : 19 ఏళ్ల యువతి బలి, అసలేంటిది, లక్షణాలేంటి?

Published on Tue, 06/10/2025 - 17:21

‘డస్టింగ్’ పేరుతో మరో సోషల్‌మీడియా భూతం అమాయక యువతీ యువకుల పారిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్‌ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. మృతురాలిని రెన్నా ఓరూర్కేగా గుర్తించారు.

ది ఇండిపెండెంట్ ప్రకారం, 19 ఏళ్ల రెన్నా ఓ'రూర్కే (Renna O'Rourke) ఏరోసోల్ వకారణంగా గుండెపోటుకు గురైంది. ఆ తరువాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అపస్మారక స్థితిలో నాలుగు రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్‌గావైద్యులు ప్రకటించారు. ప్రియుడితో కలిసి రెన్నా తమకు తెలియకుండానే ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్‌ను ఆర్డర్ చేశారని,రెన్నా తల్లిదండ్రులు  చెప్పారు. "ఆమె ఎప్పుడూ, 'నేను ఫేమస్ అవుతాను నాన్నా.. చూడండి. ' అని తరచూ చెప్పేదని అమ్మాయిల తండ్రి ఆరోన్ ఓ'రూర్కే అన్నారు.

అసలేంటీ డస్టింగ్‌ 
డస్టింగ్ - క్రోమింగ్ లేదా హఫింగ్ అని కూడా పిలుస్తారు - ఈ డస్టింగ్‌  చాలెంజ్‌ ఇపుడొక వైరల్ ట్రెండ్. ఈ ఛాలెంజ్‌‌లో సరదా, ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్‌ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కుద్వారా పీల్చుతున్నారు. అమెరికా, ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె  పనిచేయడం మానేసి, ప్రాణాలు పోయే దాకా వస్తుంది. తాము పొందే  స్వల్పకాలిక ఆనందం కన్నవాల్లకి తీరని శోకం మిగుల్చుతుందని గమనించలేకపోతున్నారు. .

19 ఏళ్ల రెన్నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేదని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరోబిడ్డకు ఇలా కాకూడదనే సదుద్దేశంతో  ఓరూర్కే కుటుంబం రెన్నా జ్ఞాపకార్థం, టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు 'హఫింగ్' వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.  గోఫండ్‌మీ పేజీని కూడా ప్రారంభించారు. "లోతుగా వెతకండి. వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది" అని రెన్నా తల్లి సూచించారు.

డస్టింగ్ లేదా క్రోమింగ్‌లో ఏమి జరుగుతుంది?
క్రోమింగ్ చేసేటప్పుడు, ప్రజలు మెటాలిక్ పెయింట్స్ ఇతర ఉత్పత్తులలోని హైడ్రోకార్బన్‌లను పీల్చడానికి ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారి తీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది.

మాదకద్రవ్యాల వినియోగం, ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది - ముఖ్యంగా టీనేజర్లు - ప్రతి సంవత్సరం ఇన్హేలెంట్‌లను ఉపయోగిస్తారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 -17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు.

డస్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు 
ఏరోసోల్ పెయింట్, పెయింట్ థిన్నర్, ఇంజీన్‌ ఫ్యూయల్‌, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్‌లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. 

తీవ్ర లక్షణాలు : ఊపిరాడకపోవడం, గుండె ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరి, కోమా, మూర్ఛలు , ప్రాణాంతక గాయం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్‌ను పూర్తిగా తొలగిస్తుంది. ఊపిరాడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను కూడా ప్రభావితం చేస్తుంది. పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)