Breaking News

జోరు వర్షంలోనూ ఆగని గర్భా నృత్యం..!

Published on Tue, 09/30/2025 - 15:07

దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం. 

కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్‌ గర్భా పవర్‌ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్‌ కలర్‌ డ్రస్‌ ధరించి,   కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. 

కాగా, గుజరాత్‌ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు  నిర్వహిస్తున్నారు కొందరు.

 

(చదవండి: ఫస్ట్‌ డే డ్యూటీ హైరానా..! వైరల్‌గా బస్సు కండక్టర్‌ స్టోరీ..)

 

 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)