Breaking News

నా సక్సెస్‌ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్‌

Published on Wed, 04/09/2025 - 11:44

ఏదైనా సక్సెస్‌ సాధించిన తరువాత  స్నేహితులకు, సన్నిహితులు  పార్టీ ఇవ్వడం చాలా కామన్‌. ఒక్కోసారి చిన్న చిన్న గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. మరి అలాంటిది ఊహించని విజయం వచ్చి వరిస్తే  ఆసంతోషాన్ని మాటల్లో వర్ణించలేం.   ఈ సంతోషాన్ని తన కరియర్‌లో సక్సెస్‌కు తొడుగా నిలిచిన  తన భార్యకు ఖరీదై గిఫ్ట్‌ ఇవ్వడం విశేషంగా నిలిచింది. 

స్టోరీ ఏంటంటే..
నటుడు, కంటెంట్ సృష్టికర్త అవినాష్ ద్వివేది 'దుపాహియా'  వెబ్‌  సిరీస్ ద్వారా అద్భుత విజయం సాధించాడు. దీంతో అతని బార్య సంభావన సేథ్‌కు తన కలల కారును బహుమతిగా ఇచ్చాడు. సంభావన కూడా నటి, యూట్యూబర్.  ఇది తమ ప్రేమ, పట్టుదలతోపాటు పాటు, తమ ఉమ్మడి కలలకు  ప్రతిరూపమని చెప్పాడు. భార్యకు  రూ. 1.81కోట్ల  విలువైన  విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో  భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు.  కొన్ని ఫోటోలను  పోస్ట్‌ చేశాడు. దీని ప్రకారొం ఈ కారు వారి 7 సిరీస్ BMW 750e లాగా కనిపిస్తోంది. దీంతో  ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

అవినాష్ ద్వివేది, సంభావన సేథ్
ప్రారంభం నుండి కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా అన్నివిధాల సంభావన, అండగా నిలిచి, ప్రతి పోరాటంలో  తనకు వెన్నెముకగా  నిలిచింది అంటూ భార్యకు కృతజ్ఞతలు తెలిపాడు. కష్టాల్లో, నష్టాల్లో తొడుగా నిలిచింది.  నిజంగా ఆమె తనకు లభించిన గొప్ప వరమని పేర్కొన్నాడు. మరిన్ని కలలతో, తమ ప్రయాణం, ఇలాగే కలకాలం సాగిపోవాలని కోరుకున్నాడు. ఇది కేవలం మన విజయం మాత్రమే  కాదు. మన తల్లిదండ్రులు ఆశీర్వాద బలం కూడా అంటూ

మీ(సంభావన) తల్లిదండ్రులు ఇప్పుడు వారితో లేకపోయినా, పై నుంచి వారు ఆశీర్వదిస్తారంటూ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా  తాను ఈ స్థాయికి రావడానికి ముంబైలో తను పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి ముంబైకి వచ్చినప్పుడు, ఒకే ఒక్క లక్ష్యం. నటుడిగా మారాలి. సక్సెస్‌సాధించాలి. ఇదే పట్టుదల. ఇందుకోసం గత ఐదేళ్లుగా నా సర్వస్వం అ‍ర్పించాను అని చెప్పాడు. అలాగే  దుపాహియాపై ప్రేక్షకుల అపారమైన ప్రేమ కురిపించారు అంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. మార్చి 2025 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్‌ విడుదలైంది. ఇది విమర్శకులు, వీక్షకులు ప్రశంసలు దక్కించుకుంది. సంభావన సేథ్ , అవినాష్ ద్వివేది 2016, జూలై 14న  వివాహం చేసుకున్నారు.  

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)