Rain Alert: వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఎడారుల్లో పచ్చదనం కోసం...
Published on Sun, 05/01/2022 - 13:21
ఎడారుల్లో మొక్కలు పెంచితే ఎంతో బాగుంటుంది కదూ! ఇది సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా? అసాధ్యమైన ఈ పనిని సుసాధ్యం చేసేందుకు నడుం బిగించారు దుబాయ్ శాస్త్రవేత్తలు. ఎడారుల్లో మొక్కలు నాటడానికి ఏకంగా ఒక రోబోనే తయారు చేశారు. ఈ రోబో ఎడారుల్లో ఎంత దూరమైనా సునాయాసంగా ముందుకు సాగుతూ, విత్తనాలు నాటి, అవి మొలకెత్తి ఏపుగా ఎదిగే వరకు సమస్త బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తుంది.
దుబాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అక్కడి విద్యార్థులు ఈ రోబోను రూపొందించారు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. ఎడారులు, బీడభూముల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతోనే దీనిని రూపొందించామని ఈ రోబో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త మజ్యర్ ఇత్తెహాది తెలిపారు.
#
Tags : 1