Breaking News

25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!

Published on Sun, 06/21/2026 - 13:11

అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకలో నీతా అంబానీ నుంచి కోడళ్లు వరకు అందరూ అత్యంత విలాసవంతమైన దుస్తులు, ముఖ్యంగా కళాఖండాలకు నిలువెత్తు నిదర్శనమైన డిజైనర్‌వేర్‌లలో తళుక్కుమన్నారు. అంతేగాదు కళ్లు చెదిరిపోయే ధర పలికే ఆభరణాలతో మెరిసిపోయారు. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా ఈ పెళ్లికూతురు దుస్తులను ధరించింది ఈ ప్రముఖ గాయని. కళాఖండమే ఆమె దుస్తులుగా మారిందా అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వధువు దుస్తులు ఎంత ప్రత్యేకం అంటే..ప్రతిదీ ఓ కళాఖండం..ఓ అద్భుతం.

బ్రిటన్‌ గాయని దువాలిపా నటుడు క్యాలమ్‌ టర్నర్‌ని జూన్‌ 20న సిసిలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబధించిన ఫోటోలను నెట్టింట షేర్‌ చేసుకున్నారు. ఈ దంపతులు మొదట లండన్‌లో దగ్గరి బంధువుల సమక్షంలో ఒక్కటవ్వగా..ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. 

అక్కడ ఆమె అద్భుతమైన పెళ్లి దుస్తులతో ఫోటోలకు పోజులిచ్చారామె. ఈ దుస్తులను రూపొందించడానికి కళాకారులకు ఏకంగా నాలుగు వేల గంటలపైనే పట్టిందని గాయని దువాలిపా ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ దుస్తుల ప్రత్యేకతను వివరిస్తూ..అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకునింది. దానికి "మిస్టర్ & మిసెస్" అని క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్‌ చేసింది.

ఆమె దుస్తుల స్పెషాల్టీ..
ఫ్రెంచ్‌ లేబుల్‌ చానెల్‌ రూపొందించిన ఈ పెళ్లి దుస్తులు వివరాల గురించి అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇలా పేర్కొంది. ఈ హాట్ కౌచర్ దుస్తులు పారిస్‌లోని హస్తకళా కేంద్రంలో రూపుదిద్దుకున్నాయని తెలిపింది.  వాటిపై ప్రత్యేకమైన డిజైన్‌ కోసం మైసన్స్ డి'ఆర్ట్ అటెలియర్ మాంటెక్స్, లెమరీ , లెసేజ్ వంటి ఫ్యాషన్‌ స్టూడియోల క్లిష్టమైన అలంకరణలు ఉన్నాయి. 

అందుకోసం తెల్లటి శాటిన్‌ వంపులను షానెల్‌ బ్రాండ్‌కి చెందిన మస్సారో హస్తకళల బృందం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇక  ఈ ఫ్రెంచ్ లేబుల్ గౌను, ముసుగుని డిజైన్‌ చేసిన విధానం గురించి కూడా సవివరంగా తెలిపింది. ఈ హాట్‌ కౌచర్‌ దుస్తులను అటెలియర్ మాంటెక్స్ ఫ్యాషన్‌ స్టూడియో నాలుగు లక్షల పైగా పూసలతో పూర్తిగా చేతితో ఎంబ్రాయిడరీ చేయగా, లెసాజ్‌ ఏకంగా  1,155 గంటల సూదితో ట్రోంప్ లొయిల్ ఆభరణాలను అమర్చింది. అంతేగాదు లెమరీ ఫ్యాషన్‌ స్టూడియో ఏకంగా 25 వేల ఈకలతో సులన్నితమైన అలంకరణ చేసింది. 

పెళ్లి కూతురు ధరించే ముసుగు, ఆరు మీటర్లలో ట్యూట్‌ ముసుగు పక్షులు, పువ్వులు కవితాత్మక చిత్రాన్ని ఆవిష్కరించింది. దీన్ని పూసలు, ఈకలతో ఎండ్రాయిడరీ చేశారు. ఈ హాట్‌ కౌచర్‌ ముసుగు డిజైన్‌ కోసం ఏకంగా మూడుగంటలకు పైగా చేతిపని అవసరమైందట. సింపుల్‌గా చెప్పాలంటే ఈ వస్త్రధారణ ఓ కళఖండం, పైగా రాబోయే ఏళ్లలో నవ వధువులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇక నటుడు క్యాలమ్ టర్నర్ కస్టమ్ లూయిస్ విట్టన్ సూట్‌లో ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ ఇటాలియన్ వివాహానికి జో అల్విన్, డొనాటెల్లా వెర్సాచే, గ్రేస్ గమ్మర్, ఒలివియా డీన్, మార్క్ రాన్సన్‌తో పాటు మరికొందరు హాజరైనట్లు సమాచారం. 

 

 

(చదవండి: ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! ఆ ఐదు జపనీస్‌ ఫుడ్‌ రూల్స్‌..)
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)