Breaking News

ఎయిర్‌పోర్ట్‌లో శివమణి హల్‌చల్‌ : గుర్తుపట్టని ప్రయాణీకులు, వైరల్‌ వీడియో

Published on Fri, 01/19/2024 - 11:14

విమానాశ్రయంలో ప్రయాణీకులంతా లగేజీ కోసం వెయిట్‌ చేస్తుండగా  సడెన్‌గా అద్భుతమైన డ్రమ్ము వాయిద్యం వినిపించింది. దీంతో అందరూ అటువైపు డైవర్ట్‌ అయిపోయారు.  అటు ప్రయాణ అలసట, ఇటు వెయిటింగ్‌ చిరాకు నుంచి  బయటపడి  'హమ్మా-హమ్మ' అంటూ సైలెంట్‌గా గొంతు కలిపారు.  కానీ అక్కడున్నది  పాపులర్‌ డ్రమ్మర్‌  శివమణి చాలా మంది గుర్తించలేకపోయారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి  ఎక్స్‌(ట్విటర్‌)లో  తెగ వైరల్‌ అవుతోంది. 

కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఈ సంఘటన  చోటు చేసుకుంది.   లగేజీకోసం  వెయిట్‌ చేయడం మొదలు  పెట్టి దాదాపు 40 నిమిషాలై పోయింది. దీంతో  ప్యాసింజర్లంతా  విసుగ్గా , అసహనంగా అటూ ఇటు కదులున్నారు.  దీంతో అక్కడున్న శివమణి ఏమనుకున్నాడో ఏమో గానీ, రంగంలోకి దిగిపోయాడు.  కన్వేయర్ బెల్ట్ రైలింగ్‌పై తన డ్రమ్‌స్టిక్‌లను ఉపయోగించి  A.R రెహమాన్ స్వరపరిచిన  'హమ్మా-హమ్మ’ పాటను వాయించడం మొదలు పెట్టాడు. తనదైన సిగ్నేచర్‌ దుస్తులు, స్టయిల్‌తో హమ్మా! అంటూ ముగించాడు. అంతే ఒక్కసారి  చప్పట్లు మారుమోగిపోయాయి. ప్రశంసలే ప్రశంసలు. కానీ అక్కడున్నది  డ్రమ్మర్‌  శివమణి అని  చాలామంది గుర్తించలేదు.  

దీనికి సంబంధించిన వీడియోను  ఒక ప్యాసింజర్‌  ట్విటర్‌లో షేర్‌  చేశారు. ఫెలో ప్యాసింజర్‌ మమ్మల్ని ఇలా ఎంటర్‌టైన్‌ చేశారు అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో  అది శివమణి అని గుర్తించిన ట్వీపుల్‌.. అయ్యో. అది గ్రేట్‌ శివమణి, మీరంతా లక్కీ అంటూ కమెంట్లు పెట్టారు. జనవరి 17న షేర్ అయిన ఈ వీడియో  ఏడు లక్షలకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. మరికెందుకు ఆలస్యం మీరు కూడా  ఎంజాయ్‌ చేయండి! 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)