పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్
Breaking News
‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘
Published on Sat, 10/31/2026 - 08:50
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా ’ఉపర్బేడ’ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో అడవి నుండి తెచ్చిన ఎండు కట్టెలతోనే ఇంట్లో వంట చేసేవారు. ఒకరోజు ద్రౌపది ముర్ము తండ్రి వంట కోసం తెచ్చిన ఒక పెద్ద ఎండిపోయిన మొద్దును గొడ్డలితో కొట్టడానికి ముందు ఆ మొద్దుకు చేతులు జోడించి నమస్కరించారు.
పక్కనే నిలబడి ఇదంతా గమనిస్తున్న చిన్నారి ద్రౌపదికి ఆశ్చర్యం వేసింది. ‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘ అని అడిగింది.
అప్పుడు ఆమె తండ్రి ‘అమ్మా! ఈ చెట్టు బతికున్నంత కాలం మనకు నీడను, ప్రాణవాయువును, పండ్లను ఇచ్చి జీవితాన్ని కాపాడింది. ఇప్పుడు ఎండిపోయినా కూడా మన ఇల్లు గడవడానికి, వంట వండుకోవడానికి తనను తాను త్యాగం చేస్తోంది. అందుకే దీనికి గాయం నమస్కరిస్తున్నాను’ అని చెప్పాడు.
తండ్రి చెప్పిన మాటలు ద్రౌపది ముర్ము మనస్సుపై బలమైన ముద్ర వేసాయి. ఆ రోజుల్లో చదువుకోవడానికి సరైన పాఠశాల భవనాలు లేకపోయినా గోనె సంచుల మీద కూర్చుని చదువుకున్నా పట్టుదలతో ముందడుగు వేసి, ఆ గ్రామం నుండి కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన మొదటి మహిళగా నిలిచారు. ఆ పట్టుదలే ఆమెను నేడు దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది.
ఇదీ చదవండి: 99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!
Tags : 1