Breaking News

ఈ సమస్యను.. పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ అంటారు! ఇదీ..

Published on Sun, 08/04/2024 - 01:25

నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్‌ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్‌ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా కంప్లీట్‌ రిలీఫ్‌ రావడం లేదు. – అమృత, విజయవాడ

మీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్స్‌. అది వెజైనల్‌ / యూరిన్‌లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్‌ను కలసి వెజైనల్, యూరిన్‌ శాంపిల్స్‌ తీసుకుని, బ్యాక్టీరియల్‌ లేదా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్‌ని కలసి యురేటరల్‌ స్వాబ్‌ తీసుకోమని చెబుతారు.

ఇద్దరికీ ట్రీట్‌మెంట్‌ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చెయ్యమని చెప్తారు. ఇన్‌ఫెక్షన్స్‌ సరిగ్గా ట్రీట్‌ చెయ్యనప్పుడు ఫాలోపియన్‌ ట్యూబ్‌కి ఏ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించినా ట్యూబ్స్‌ బ్లాక్‌ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌కి ట్రీట్‌మెంట్‌ మొదలుపెడితే ఈ లాంగ్‌టర్మ్‌ రిస్క్స్‌ ఏమీ ఉండవు.

డాక్టర్‌ చెప్పిన యాంటీబయాటిక్స్‌ కూడా సరైన టైమ్‌కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్‌లో ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఏడాదికి చెకప్‌కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్‌ ద్వారా ట్యూబ్స్‌లో బ్లాక్‌ ఉందా అని చెక్‌ చేస్తారు. కొన్ని బ్లడ్‌ టెస్ట్‌ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్‌మెంట్‌ ఇస్తే, మళ్లీ వెజైనల్‌∙ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)