Breaking News

స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్‌ సిస్ట్స్‌తో ఏమైనా ప్రమాదమా?

Published on Sun, 07/07/2024 - 01:26

నాకు 20 ఏళ్లు. పీరియడ్స్‌ పెయిన్‌ సివియర్‌గా ఉంటోంది. స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్‌ సిస్ట్స్‌ ఉన్నాయని చెప్పారు. వీటివల్ల ప్రమాదమేమైనా ఉంటుందా? – కునాలిక, వైజాగ్‌

ఇవి కొన్నిసార్లు గర్భసంచి పొరలోని టిష్యూ పెల్విస్‌లో ట్యూబ్స్, ఓవరీస్, వెజైనా మీద పెరుగుతాయి. పీరియడ్స్‌ టైమ్‌లో గర్భసంచిలో బ్లీడింగ్‌ అయినట్టే వేరేచోట కూడా బ్లీడ్‌ అయ్యి సిస్ట్స్‌ పెయిన్‌ వేస్తాయి. పీరియడ్స్‌లో పొట్టలో నొప్పి, యూరిన్‌లో, మోషన్‌లో లోయర్‌ బాడీ అంతా నొప్పి ఉండొచ్చు. ఇవి ఎందుకు వస్తాయి అనేదానికి స్పష్టమైన కారణమేమీ లేదు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్స్‌కి సంబంధించిన కారణాలు ఉంటాయి.

ఇవి పదిమందిలో ఒకరికి ఉంటాయి. ఎమ్మారై స్కాన్‌లో కన్‌ఫర్మ్‌గా ఇది ఎండోమెట్రియాసిస్‌ అని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా పెయిన్‌ రిలీఫ్‌ మెడిసిన్స్‌ని వాడాల్సి వస్తుంది. పారాసిటమాల్, ట్రామడాల్‌ లాంటివి బాగా పనిచేస్తాయి. మీ ఏజ్‌ గ్రూప్‌ వారికి హార్మోన్‌ పిల్స్‌ బాగా పెయిన్‌ రిలీఫ్‌ని ఇస్తాయి. ఇవి ఎండోమెట్రియాసిస్‌ సిస్ట్స్‌ లేదా చాకొలేట్‌ సిస్ట్స్‌ని కుంచించుకుపోయేలా చేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి. కంబైన్డ్‌ ఓరల్‌ కంట్రాసెప్టివ్‌ పిల్స్‌ని క్రమం తప్పకుండా నెలంతా వేసుకోవాలి.

ఈ మాత్రలతో వికారం, తలనొప్పి వంటి చిన్న చిన్న సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చు. కానీ రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. 3 నుంచి 6 నెలల్లో మినిమమ్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. చాకొలేట్‌ సిస్ట్స్‌ సైజ్‌ 5 సెం.మీ కన్నా ఎక్కువున్నా, హార్మోన్స్‌ పనిచేయకపోయినా లాపరోస్కోపీ సర్జరీ సూచిస్తారు. ఈ సిస్ట్స్‌ని తీసేసిన తరువాత క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ మెరుగవుతుంది. కానీ రికరెన్స్‌ అంటే మళ్లీ వచ్చే రిస్క్‌ కూడా ఎక్కువే. క్లోజ్‌ ఫాలో అప్‌ స్కాన్స్‌ చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఫాలో కావాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

కొంతమందికి GnRH analogue ఇంజెక్షన్స్‌ ఇస్తారు. సర్జరీ తరువాత కూడా కొందరికి వీటిని సజెస్ట్‌ చేస్తారు. లాపరోస్కోపీ సర్జరీలో సిస్ట్స్‌ని తొలగించి.. ఏమైనా ఎండోమెట్రియాటిక్‌ స్పాట్స్‌ ఉంటే వాటిని కూడా fulgurate చేస్తే పెల్విక్‌ పెయిన్‌ బాగా తగ్గుతుంది. ఎండోమెట్రియాసిస్‌ సిస్ట్స్‌ ఉన్నాయని తెలిసినప్పుడు క్లోజ్‌ ఫాలో అప్‌లో ఉండాలి.

ఇవి చదవండి: ఏదో మిస్‌ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)