ఒకసారి రిజిస్టర్‌చేసిన పెళ్లి మళ్లీ రిజిస్టర్‌ చేస్తే జైలు తప్పదు!

Published on Wed, 07/22/2026 - 09:26

నేను దుబాయ్‌లో ఉంటాను. మా ఆవిడ, పిల్లలు కడపలో ఉంటారు. వాళ్ళని డిపెండెంట్‌ వీసా మీద దుబాయ్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మాది 2012లో మతాంతర వివాహం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం క్రింద నమోదు చేసుకున్నాము. సర్టిఫికేట్‌లో తన పాత పేరే ఉంది. ప్రస్తుతం తన పేరు శ్రీ లక్ష్మి. గెజిట్‌ ద్వారా పేరు కూడా శ్రీ లక్ష్మి అని మార్పించాము. అయితే వీసా కోసం వెళ్ళినప్పుడు ఇక్కడి అధికారులు   పాస్‌పోర్టులో ఉన్న పేరుతోనే పెళ్లి సర్టిఫికెట్‌ కావాలి – లేకుంటే కుదరదు అంటున్నారు. రిజిస్ట్రార్‌గారిని సంప్రదిస్తే పెళ్లి సర్టిఫికెట్‌లో మార్పు కుదరదని చెప్పారు. హైదరాబాదులో ఇంకోసారి పెళ్లి రిజిస్టర్‌ చేసుకోమని ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు. 2012లో జరిగిన పెళ్లిని ఇంకోసారి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు కావాలి, ఎలా చేర్పించాలి... సలహా ఇవ్వగలరు.  
– జగపతి, దుబాయ్‌

ఒకసారి రిజిస్టర్‌ చేసుకున్న పెళ్లిని మరో రాష్ట్రంలో ఇంకోసారి రిజిస్టర్‌ చేసుకోవటం చట్టరీత్యా నేరం. అలా తయారు చేసిన రెండవ పెళ్లి పత్రం చెల్లదు. చెల్లని పత్రాలని విదేశాలలో ఉపయోగిస్తానంటున్నారు కాబట్టి – దొరికితే దుబాయ్‌లో జైలు తప్పదు – మీ ఆవిడతో ΄ాటు మీ వీసా కూడా రద్దయిపోతుంది. గెజిట్‌ ఉందన్నారు కాబట్టి – అన్ని పత్రాలతో పాటు మీ ఆవిడ చేత పేరు మార్పునకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత పత్రాలతో పాటు ఒక అఫిడవిట్‌ను కూడా జతపరిచి దుబాయ్‌లోని భారతీయ హై కమిషన్‌ ఆఫీసు ద్వారా ధ్రువీకరించుకోండి (అపాస్టిల్‌ అంటారు). అంతే కాక మీకు – మీ కుటుంబానికి ఉన్న సంబంధం కూడా ధ్రువీకరించవచ్చు. రిజిస్ట్రార్‌ ఆఫీసునుంచి మీ ఆవిడ పాత పేరు – కొత్త పేరు ఒకరివే అనే ధ్రువీకరణ ఇస్తారేమో అడగండి – లేనిపక్షంలో కోర్టును సంప్రదించి పరిష్కారం కోరటం గురించి ఆలోచించవచ్చు. మీరు పైన చెప్పిన విధంగా యూఏఈ అధికారులకి సరైన పత్రాలు అందజేస్తే పరిష్కారం ఉంటుంది. ఇవ్వన్నీ కాదు – కొన్నాళ్లు జైలుకి పోయినా ఫర్వాలేదులే అనుకుంటే, మీ స్నేహితుడు చెప్పినట్లుగా హైదరాబాదులో రిజిస్ట్రేషన్‌కి అప్లై చెయ్యండి.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం
sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)