Breaking News

Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!

Published on Tue, 06/24/2025 - 13:17

నిద్రను మించిన సుఖం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆవేదనలనుంచి అలసటనుంచి ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అందుకే కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది అంటాడో సినిమా కవి.మరో విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద అత్యంత బలమైన ఔషధం నిద్ర. కానీ ఆధునిక కాలంలో నిద్ర అనేది చాలామంది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది.మారుతున్న జీవన శైలి, నిద్రలేమి  ప్రభావం యువతమీద , ఉద్యోగుల మీద​ తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? పదండి ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది  డేలో భాగంగా నిద్రప్రయోజనాలు, పరిష్కారాలు తెలుసుకుందాం.

నిద్ర అంటే ఏమిటి?
నిద్ర  అంటే  శరీరం , మెదడు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించే ఒక సాధారణ శరీర ప్రక్రియ.  రాత్రిపూట  నిద్ర వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అఇయతే కళ్లు మూసుకోగానే   నిద్రలోకి జారిపోయే అదృష్టవంతులకు ఇది చాలా సులభం అనిపించినా, నిద్రాదేవత అనుగ్రహించని వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. 

వ్యాయామం ,సమతుల్య ఆహారం లాగానే నిద్ర కూడా మన ఆరోగ్యానికి  చాలా అవసరం  నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు  చుట్టుముట్టే ప్రమాదం ఉంది. 

ఆరోగ్యంగా ఉండాలంటే  ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు 18 గంటలు , చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజర్లకు 10 గంటలు నిద్రపోవాలని  అంటారు నిపుణులు. 

మంచి నిద్ర మెదడును ఉత్తేజ పరుస్తుంది. మరుసటి రోజు పనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. విసెరల్ కొవ్వును కరిగిస్తుంది.DNA నష్టాన్ని సరిచేస్తుంది . కొత్త మెదడు కణాలను ఉత్పత్తి చేస్తుంది.

  • మంచి నిద్రకోసం చిట్కాలు
    మంచినిద్ర కావాలంటే జీవన శైలి  సక్రమంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.నిద్రవేళకు 3 గంటలలోపు వ్యాయామం చేయాలనేది గుర్తించుకోండి

  • రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం.

  •  మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు , కంప్యూటర్ల నుండి వెలువడే నీలిరంగు కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. కనుక పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరం పెట్టేయాలి.

  • వేడి నీటి స్నానం, పుస్తకం పఠనం,  ప్రశాంతమైన సంగీతం వినడంతోపాటు నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.

  • పడకగదిని నిద్రకు అనుకూలంగా అంటేగదిని చీకటిగా, ప్రశాంతంగా, వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవాలి.

  • ధ్యానం , యోగా, శ్వాస వ్యాయామాలు నిద్రకు సహాయపడతాయి.మంచినిద్ర కావాలంటే డి విటమిన్‌  చాలా అవసరం పగటి నిద్ర రాత్రి నిద్రకు చేటు. రాత్రి పూట హెవీ మీల్‌ తినవద్దు

సాయం చేసే ఆహారం

  • పైన చెప్పిన జాగ్రత్తలతోపాటు పడుకునే ముందు 1 ఔన్స్ టార్ట్ చెర్రీ రసం లేదా రోజుకు రెండుసార్లు టార్ట్ చెర్రీస్ తినవవచ్చు.

  • పుట్టగొడుగులు,సాల్మన్, ట్యూనా చేపలు సహజంగా మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.

  • ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కెమిస్ట్రీని ఆప్టిమైజ్ చేస్తాయి.

  • పాలీఫెనాల్ అధికంగా ఉండే బెర్రీలు (బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్) తీసుకోవచ్చు.

  •  ఆరోగ్యవంతమైన సెక్స్‌ తరువాత కూడా మంచి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

నోట్‌ : ఎంత ప్రయత్నించినా నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కారణాలను విశ్లేషించుకుని తగిన  చికిత్స తీసుకుంటే నిద్రా దేవి ఒడిలో ఒరిగిపోవడం ఖాయం. 
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)