Breaking News

వింత కేసు: బైక్‌, డబ్బు సరిపోదు, కట్నంగా కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే!

Published on Thu, 06/12/2025 - 15:05

ఇటీవల కాలంలో పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటలా ఉంటున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరి వివాహేతర సంబంధాలు, సోషల్‌ మీడియా క్రేజ్‌ వంటి రకరకాల కారణాలతో వైవాహిక బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మరికొన్ని చోట్ల వరకట్నం దంపతుల పాలిట శాపంగా మారి బాంధవ్యాన్ని ముక్కలు చేస్తోంది. ఎన్నో వరకట్నం కేసుల్లో నగదు లేదా బంగారం వంటి అత్తింటి డిమాండ్లు గురించి విని ఉంటాం. కానీ ఇలాంటి డిమాండ్లతో కూడిన వరకట్నం కేసు మాత్రం ఇదే మొదటిది. 

వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీప్తి అనే మహిళకు 2021లో అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లైన రెండు నెలల వరకు వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ.. బైక్‌, మరికొంత నగదు ఇవ్వాల్సిందే అంటూ దీప్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు అత్తింటివారు. అక్కడి వరకు బాగానే ఉంది. 

ఇప్పుడూ మా అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడి కోసం కిడ్నీ కూడా దానం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే దీప్తి భర్త పెళ్లికి ముందు నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నడు. కానీ దీప్తికి ఆ విషయం పెళ్లైన తర్వాతే తెలిసింది. మొదట్లో అత్తంటి వారి డిమాండ్లు ప్రతీఇంట్లో ఉండేవే కదా అని తేలిగ్గా తీసుకుంది. అది రాను రాను మితిమీరి..ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేంత వరకు దారితీశాయి. 

ఆమె కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే కుటుంబంలో మరింత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో పోలీసులను సంప్రదించింది దీప్తి. ఆ నేపథ్యంలో అధికారులు ఇరువురి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా..అది కూడా విఫలమైంది. అదీగాక అత్తింటి వేధింపులతో విసిగిపోయిన దీప్తి భర్తతో కలిసి ఉండేందుకు నిరాకరించి, విడాకులు కావాలంటూ కోర్టుని ఆశ్రయించింది. అందుకు భర్త మాత్రం ససేమిరా అంటున్నాడు. 

అలాగే పోలీసులు దీప్తి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతోపాటు మరో ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఎక్కడైనా వరకట్నం కేసులో..అధిక డబ్బు లేదా బంగారం కోసం డిమాండ్‌ చేయడం వంటివి ఉంటాయి ఏకంగా ఓ వ్యక్తి అవయవాన్ని సైతం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేసిన వింత కేసు ఇదేనని చెబుతున్నారు అధికారులు.

(చదవండి: చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..! తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు..)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)