Breaking News

‘ట్రంప్‌ కృష్ణ’ : తెలంగాణాలో ట్రంప్‌ ఆలయంలో పూజలు, సంబరాలు

Published on Thu, 11/07/2024 - 17:31

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  డోనాల్డ్‌ ట్రంప్‌ విజయ ఢంకా మోగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అనేక దేశాధినేతలు ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే తెలంగాణాలోని ఒక పల్లె ప్రజలు మాత్రం ఇంకో అడుగు ముందుకేశారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్‌ అభిమానులు ట్రంప్‌ గుడిలో ఏకంగా పూజలు చేశారు.  ట్రంప్‌కు గుడి ఏంటి  అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి విశేషం. 2020లోనే ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడో వీరాభిమాని. ఆయనే కొన్నె గ్రామానికి  బుస్స కృష్ణ. రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ.  ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని కలలు గనేవాడట.  ట్రంప్‌ కోసం ఏకంగా  ఉపవాస దీక్షలు చేసేవాడట. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ, 2020 అక్టోబరు 11న కన్నుమూశాడు.

  బుస్సా కృష్ణ (ఫైల్‌ ఫోటో)

అంతేకాదు  2019లో కృష్ణ పెట్టిన ట్వీట్‌కు ట్రంప్‌ స్పందించడం మరో విశేషం.‘‘మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీంతో కృష్ణ చాలా సంబరపడి పోయాడట.  ట్రంప్‌ టీ షర్టులనే ధరించేవాడట. అలాగే తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి పెట్టుకునేవాడు. అందుకు కృష్ణ గ్రామస్తుల హృదయాల్లో  ‘ట్రంప్ కృష్ణ’గా  ముద్ర వేసుకున్నాడు.

 తాజా ఎన్నికల్లో ట్రంప్‌ అధ్యక్షుడుగా విజయం సాధించడంతో  గ్రామస్తులు తమ ‘ట్రంప్‌ కృష్ణ’ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా అని భావించారు. ఆయన లేని లోటు తీర్చేందుకా అన్నట్టుగా కృష్ణ మిత్రులు కొంతమంది బుధవారం  ట్రంప్‌ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, ధూప దీప  నైవేద్యాలు,  సమర్పించి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

 

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)