Breaking News

డొనాల్డ్ ట్రంప్ బరువు తగ్గడం: ఒత్తిడి కారణంగా బరువు కోల్పోతారా..?

Published on Fri, 11/08/2024 - 17:57

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.  అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నా ట్రంప్‌ చాలా బరువు కోల్పోయినట్లుగా కనిపిస్తున్నారు. మునుపటి ట్రంప్‌లా కాకుండా చాలా స్లిమ్‌గా ఉన్నారు. ఆయన బరువు తగ్గేందుకు ఏవేవో వాడుతున్నారంటూ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

కానీ అందులో ఏ మాత్రం నిజంలేదు. ఓ ఇంటర్వ్యూలో తానెందుకు బరువు తగ్గారో స్వయంగా వివరించారు ట్రంప్‌. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉండటం వల్లే హాయిగా తినే సమయం లేకపోయిందని అందువల్లే బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఆహారంపై శ్రద్ధ చూపకుండా పనిలో బిజీగా ఉంటే బరువు తగ్గిపోతామా..?. ఇలా అందరికీ సాధ్యమేనా..?.

అధ్యక్ష్య ఎన్నికల కారణంగా వచ్చే ఒక విధమైన ఒత్తిడి, బిజీ షెడ్యూల్‌ తదితరాలు ట్రంప్‌ బరువు కోల్పోయేందుకు దారితీశాయి. ఇక్కడ ట్రంప్‌ నిరవధిక ప్రచార ర్యాలీల కారణంగా సరిగా భోజనం చేయలేకపోయానని చెప్పారు. ఓ పక్క వేళకు తిండి తిప్పలు లేకపోవడం, మరోవైపు ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న ఆందోళన తదితరాలే ఆయన బరువు తగ్గేందుకు ప్రధాన కారణాలు. మొత్తంగా దీని ప్రభావం వల్ల ట్రంప్‌ దాదాపు 9 కిలోలు తగ్గిపోయారు. నిజానికి ఒత్తిడి కారణంగా బరువు పెరగాలి కానీ ట్రంప్‌ విషయంలో అందుకు విరుద్ధంగా ఉంది. ఇదెలా అంటే..

మానిసిక ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడం అనేది మనస్సు, శరీరానికి సంబంధించినదని చెబుతున్నారు. ఇక్కడ శారీరక ఆరోగ్యాన్ని ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పేందుకు స్వయంగా ట్రంప్‌ ఒక ఉదాహరణ అని అన్నారు. ఎప్పుడైనా ఒత్తిడికి లోనైతే శరీరంలో కార్డిసాల్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. అందుకు అనుగుణంగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో రక్తప్రవాహంలో కార్టిసాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి విపరీతమైన ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటి మార్పులకు లోనవుతుంది. 

ప్రతిఒక్కరిలో ఈ ఒత్తిడి ఒక్కో విధంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కొందరు దీని కారణంగా బరువు తగ్గొచ్చు, మరికొందరూ పెరగొచ్చు అని అన్నారు. అంతేగాదు కొందరిలో ఈ ఒత్తిడి బ్రెయిన్‌ని ఆడ్రినల్‌ హార్మోన్‌ విడుదలచేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గిపోవడం మొదలవుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా తీవ్ర ప్రభావం చూపి కేలరీలు బర్న్‌ అయ్యేలా చేసి బరువు కోల్పోయేందుకు దారితీస్తుంది. 

మరికొందరికి మాత్రం.. ఒత్తిడిలోనైతే ఇదే కార్డిసాల్‌ అధిక కేలరీలు కలిగిన చక్కెరతో కూడిన పదార్థాలను తినేలా ప్రేరేపిస్తుంది. దీని వల్ల చాలామందికి పొత్తికడుపు పెద్దగా లావుగా ఉండటం లేదా బానపొట్ట తదితరాలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులు కనీస శారీరక శ్రమ చెయ్యనట్లయితే ఒబెసిటికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

(చదవండి: అందాల రాణి ఐశ్వర్య రాయ్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!)
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)