బోరబండలో డొనాల్డ్‌ ట్రంప్‌!

Published on Fri, 07/03/2026 - 07:54

హైదరాబాద్‌లోని ఒక రోడ్డుకు ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’ అని తన పేరు పెట్టారనే విషయం తెలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకేసారి వంద ఎల్‌పీజీ సిలిండర్‌లు ఫ్రీగా ఇంటికొచ్చినంతగా సంతోషించాడు. ఆ సంతోషంలో... ‘అర్జంటుగా హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటున్నాను. ప్రయాణ ఏర్పాట్లు చేయండి’ అని సిబ్బందిని ఆదేశించాడు. విమానం ఎక్కడానికి ముందు ‘30 రోజుల్లో తెలంగాణ భాష–యాస’ అనే పుస్తకాన్ని బట్టీ పట్టాడు ట్రంప్‌. కొన్ని రోజుల్లోనే తెలుగు భాషపై గట్టి పట్టు సంపాదించి గ్రేట్‌ అనిపించుకున్నాడు.

హైదరాబాద్‌లో ట్రంప్‌.... ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’ అనే బోర్డ్‌ను చూస్తూ నాన్‌స్టాప్‌గా ఆనందించాడు. ఆ తరువాత... ‘మారు వేషంలో గల్లీ గల్లీ తిరగాలనుకుంటున్నాను. నో సెక్యూరిటీ గిక్యూరిటీ’ అన్నాడు ట్రంప్‌.
‘సార్‌...ప్రాబ్లం అవుతుందేమో!’ అన్నారు అమెరికా నుంచి వచ్చిన హై ప్లస్‌ సెక్యూరిటీ వాళ్లు. ‘ఐ లవ్‌ ప్రాబ్లమ్స్‌. ప్రాబ్లమే నాప్రాణం. ప్రాబ్లమే నా ప్రతిబింబం. ప్రాబ్లమే నా సుడిగుండం. ప్రాబ్లమే నా అగ్నిగుండం. ప్రాబ్లమ్‌ లేకుండా నేనే లేను’ కవితాత్మకంగా అన్నాడు ట్రంప్‌.

‘సరే... తమరి ఇష్టం’ అన్నారు సెక్యూరిటీ వాళ్లు.
ఒక సాధారణ రైతు వేషంలో హైదరాబాద్‌లో తిరుగుతున్న ట్రంప్‌ బోరబండలోని ‘పీపీటీ–పీపాలకు పీపాలు తాగండి’ అనే జనతా బార్‌ దగ్గర ఆగాడు. మందుబాబులు బార్‌లో కాదు... రోడ్డు మీద, రోడ్డు పక్కన, చెట్టు కింద, చెట్టు పైనా... ఎక్కడ పడితే అక్కడ మందు తాగుతూ కనిపించారు.

వారిని ఆసక్తిగా గమనిస్తున్నాడు ట్రంప్‌. ఇంతలో దూరం నుంచి ఒక మందుబాబు పరుగెత్తుకు వచ్చి... ‘అన్నా... నువ్వు ఇక్కడున్నవా... నీ కోసం వెదుకని స్టేట్‌ లేదు. ఊరు లేదు’ అని ట్రంప్‌ మీద పడి ఏడ్వడంప్రారంభించాడు. ‘నేను నీ అన్నేమిటీరా... లిక్కరికీ కిరికిరీ. నోర్ముస్కొని పో’ అని గద్దించాడు ట్రంప్‌.
‘ఒరేయ్‌ ఎంకులు, శ్రీను, ఎంకటేశ్వర్లు,  గుర్నాదం... ఒకసారి ఇటొచ్చేయండి’ అని గట్టిగా అరిచాడు మందుబాబు. అంతే... సాటి మందుబాబులు పరుగెత్తుకు వచ్చారు. ‘ఇన్ని రోజులు ఎక్కడికి బోయినవు అన్నా... మేమెట్ల బతకాలే అన్నా... నిన్ను చూస్తే బోనాల పండుగ ముందుగాల్నే వచ్చినట్లుంది’ అని ట్రంప్‌ను గట్టిగా పట్టుకున్నారు ఆ నలుగురు.

ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్‌ వచ్చాడు. ‘ఏందిరా మీ లొల్లి?’ అని గద్దించాడు.
‘ఈయన మా అన్న నర్సింగ్‌. రెండు సంవత్సరాల కింద ఇంట్ల నుంచి పారిపోయిండు. ఇప్పుడు దొరికిండు’ అన్నాడు గుర్నాదం.
‘ఈనే మీ అన్న అని గ్యారెంటీ ఏమిటీ?’ అడిగాడు కానిస్టేబుల్‌. సెల్‌ఫోన్‌ ఫొటోగ్యాలరీలో పాత ఫోటోలు చూపించాడు శ్రీను.
‘ఏమయ్యా పెద్ద మనిషి... ఈ ఫోటోలలో ఉన్నది నువ్వే కదా! ఎందుకు అబద్దం ఆడుతున్నవు?’ అని ట్రంప్‌పై చిరాకు పడ్డాడు కానిస్టేబుల్‌.

‘మిస్టర్‌ కానిస్టేబుల్‌... సేమ్‌ టు సేమ్‌ ఉండే వ్యక్తులు లోకంలో ఏడుగురు ఉంటారు అనే స్మాల్‌ విషయం నీకు తెలియదా?’ కానిస్టేబుల్‌పై కన్నెర్ర చేశాడు ట్రంప్‌. ట్రంప్‌  కోపాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్‌.
‘అన్నా... నువ్వు చీపు లిక్కర్‌ తాగక చానా రోజులైంది’ అంటూ అపురూప మద్యాన్ని ట్రంప్‌తో బలవంతంగా తాగించారు ఆ నలుగురు. అంతే... శ్రీ ట్రంప్‌కు క్షణాల్లో పద్నాలుగు లోకాలు, సమస్త జీవరాసులు,  నక్షత్రమండలాలు, ఉల్కలు, అంతరించి పోయిన డైనోసర్‌లు, గ్రహాంతర జీవులు కనిపించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా కనిపించింది!!! – యాకుబ్‌ పాషా

Videos

క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి

కేతన్ కేసులో కీలక మలుపు

ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్

పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్

ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ

మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో

ప్రశ్న రావణీని కోర్టుకు తీసుకెళ్తుండగా జనసైనికుల ఓవర్ యాక్షన్

వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు

సీనియర్ NTR డైలాగ్ చెప్పిన హెరోయిన్ భాగ్య శ్రీ

ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్

Photos

+5

ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు)

+5

సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)

+5

మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)

+5

పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)

+5

క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్‌ జగన్‌ భరోసా (ఫొటోలు)

+5

నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్‌ నభా నటేష్.. (ఫొటోలు)