Breaking News

బరువు తగ్గడం కోసం కార్బోహైడ్రేట్లను తగ్గించేస్తున్నారా?

Published on Thu, 12/28/2023 - 13:45

చాలామంది బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తీసుకోవడమే మంచిదని గట్టిగా విశ్వసిస్తారు. అయితే వైద్యులు ఇది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదంటున్నారు. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే కార్బోహైడ్రేట్‌ దూరం చేసినంత మాత్రం శరీరంలోని కొలస్ట్రాల్‌ ఎంతమాత్రం తగ్గిపోదని అంటున్నారు. దీని వల్లే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ షాకింగ్‌ విషయాలు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్బోహైడ్రేట్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మేలని అంటున్నారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువుగా ఉండే తృణ ధాన్యాలు, మొక్కల ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టిపెడితే సులభంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఈ లెస్‌ కార్బోహైడ్రేట్‌ డైట్‌ అధిక బరువు సమస్యకు చెక్‌పెట్టడంలో  కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ తక్కువ కార్బోహైడ్రేట్‌ ఉన్న ఆహారాలు అంటే.. చక్కెరకు సంబందించిన పదార్థాలు, పాస్తాలు, రొట్టెలు కాకుండా తీసుకుంటే బరువు తగ్గడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సమ స్థాయిలో ఉంటాయని అంటున్నారు.

ఈ మేరకు హార్వర్‌ యూనివర్సిటీ పరిశోధకులు  సుమారు లక్షకు పైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. కొందరికి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉ‍న్న మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. మిగతావారికి పూర్తిగా కార్బోహ్రైడేట్‌ లేని శుద్ధి చేసిన పదార్థాలు, మాంసం వంటివి ఇచ్చారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వారి ఆరోగ్యం గురించి డేటా ట్రాక్‌ చేశారు. దానిలో తక్కవ కార్బోహైడ్రేట్‌ ఉ‍న్న హెల్తీ ఆహారాన్ని తీసుకున్నవారు బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు కనిపించాయని, మిగతా వారిలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. పైగా ఇలా తక్కువ కార్బోహైడ్రేట్‌ ఉన్న ఆహార తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయని అన్నారు. 

తక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉన్న ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు... 

  • బరువు తగ్గుతారు
  • మధుమేహం అదుపులో ఉంటుంది
  • రక్తపోటు నార్మల్‌గా ఉంటుంది
  • గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

(చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!)

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)