2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
వైద్య వృత్తిని వదలేసి బన్‌షాప్!
Published on Wed, 09/23/2026 - 14:35
ఏ పని చిన్నది పెద్దది ఉండదు. నిజాయితీగా ఉంటే..మనసుకి నచ్చిన ఏ పనైనా చేయొచ్చు అంటుంటారు పెద్దలు. కాకపోతే చేసేముందే ఇబ్బందులు, సవాళ్లు, బేరీజు చూసుకునే దిగడం అన్ని విధాల శ్రేయస్కరం. ఇదంతా ఎందుకంటో ఓ డాక్టర్ ఎంతో గౌరవప్రదమైన వృత్తి జీవితాన్ని వదలుకుని బన్‌షాప్ నడుపుతోంది. ఇదేంటి అని విస్తుపోకండి. అయినా అంత ఉన్నత వృత్తిని కాదనుకుని ఆ స్థాయి ఉద్యోగం చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి కూడా. మరీ ఈ డాక్టమ్మ అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా..?.
చైనాకు చెందిన 48 ఏళ్ల డాంగ్ విన్ అనే డాక్టరమ్మ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రస్తుతం హుబే ప్రావిన్స్, వూహాన్‌లో స్టీమ్డ్ స్టఫ్డ్ బన్ షాప్‌ని నిర్వహిస్తోంది. ఆ వ్యాపారాన్ని జస్ట్ మూడేళ్లలోనే విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదింది. అంతేగాదు గత జూలై నెలలోనే రెండో బ్రాంచ్‌ని కూడా ప్రారంభించిందామె. ఎంతో గౌరవప్రదమైన డాక్టర్ వృత్తి ఎందుకు కాదనుకుందంటే..
ఆమె 2023లో ఈ ఉద్యోగానికి రిజైన్ చేసిందట. డాంగ్ డాక్టర్‌గా ఉన్నప్పుడు విపరీతమైన ఒత్తిడికి గురై ఈ వృత్తికి రిజైన్ చేయాలని పదేపదే అనుకునేదట. గైనకాలజిస్ట్‌గా అపారమైన అనుభవం ఉన్న ఆమె 1999లో వుహాన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, షెన్‌జెన్‌లోనే గైనకాలజిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. అయితే తన తల్లి ప్రైవేట్ క్లినిక్‌లో సహాయం చేసే నిమిత్తం వూహాన్‌కి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. తన తల్లి పదవీ విరణమ అనంతరం ఆ క్లినిక్ మూతబడిందని, దాంతో హుబేలోని టియాన్‌మెన్‌కు తిరిగి వచ్చి డాక్టర్‌గా వృత్తి తోపాటు తన కమ్యూనిటీ న్యాయవాదిగా కూడా పనిచేసినట్లు పేర్కొంది.
దాంతో తాను ఒక పక్క డాక్టర్‌గా విధులు నిర్వర్తించడం తోపాటు..ప్రభుత్వ ఏజెన్సీల తనిఖీలను కూడా తరుచుగా నిర్వహించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది. అందువల్ల విపరీతమైన ఒత్తిడి, ఆందోళనకు గురైనట్లు వెల్లడించింది. అలాగే ఆస్పత్రికి న్యాయవాదిగా ఉన్నందున కొన్ని కేసులకు బాధ్యత కూడా వహించక తప్పేది కాదని వాపోయింది. దాంతో ఈ ఉద్యోగంపై విరక్తి, రిజైన్ చేయాలన్న విసుగు వచ్చేశాయని వెల్లడించింది.
అయితే తన స్నేహితురాలి కుటుంబం నడిపే బన్ వ్యాపారం ఎందుకనో తనను విపరీతంగా ఆకర్షించిందని పేర్కొంది డాంగ్. అలా ఆమె స్ఫూర్తితోనే 2023లో ఆవిరి మీద ఉడికించే స్టఫ్డ్ బన్‌ల వ్యాపారంపై ఆసక్తి మొదలై..వ్యాపారం పెట్టేందుకు దారితీసిందని చెబుతోంది. అయితే ఆమె బన్ వ్యాపారంలో పెట్టబడి మాత్రమే పెట్టింది. అయితే చెఫ్ అనుకోకుండా రాజీనామా చేయడంతో డాంగ్‌నే స్వయంగా బన్‌ల తయారీ నేర్చుకుని, ఆ పనిని ఆస్వాదించడం ప్రారంభించింది.
అలా తాను పూర్తిగా వైద్యవృత్తిని వదిలిపెట్టి బన్ దుకాణాన్నే నడుపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తనకు 50 ఏళ్లు అని ఎన్నో అనుభవాలు చవిచూశానని అందువల్ల ఇతరులు ఏం అనుకుంటారనేది అనవసరం అని తెగేసి చెప్పింది డాంగ్. అంతేగాదు తనకు నచ్చిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నా అందుకే ఇలా చేశానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. అయితే ఈ వ్యాపారంలో కూడా 10 గంటలకు పైగా తీరిక లేకుండా పనిచేయాల్సి ఉన్నా..డాక్టర్‌గా ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఇప్పుడు అనుభవించడం లేదని చెబుతోంది డాంగ్.
అంతేగాదు తన తల్లి, సోదరుడు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా దుకాణంలో తనకు చేదోడు వాదోడుగా ఉంటున్నట్లు సంతోషంగా చెప్పుకొచ్చింది. పైగా జీవితంలో మార్పుకి ఆలస్యం అంటూ ఉండదని, తను కదలలేని స్థితికి చేరుకునే వరకు కూడా ఈ షాప్‌ని నడుపుతానని ధీమాగా చెబుతోంది డాంగ్.
ఇదీ చదవండి: కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని క్యాప్సికమ్ సాగు..! ఇవాళ ఏకంగా..)
Tags : 1