Breaking News

రెగ్యులర్‌గా కాఫీ... వయసు పెరిగిపోతుంది జాగ్రత్త!

Published on Tue, 01/27/2026 - 08:13

సాధారణంగా చాలామందికి ‘కాఫీ’తోనే రోజు మొదలవుతుంది. ఈ వేడివేడి పానీయం సమయానికి అందకపోతే విలవిలలాడిపోతుంటారు. అయితే తరచూ ‘కాఫీ’ తాగడంతో వచ్చే సమస్యలపై ఒక వైద్య నిపుణుడు చెప్పిన వివరాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇవి కాఫీ ప్రియులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.  మనం కొత్త ఉత్సాహం కోసం కాఫీని తాగుతుంటాం. అయితే ఇది మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగళూరులోని సాక్రా వరల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం రవికుమార్ హెచ్చరించారు. ఆయన ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’తో మాట్లాడుతూ ‘కాఫీ’తో వచ్చే సైడ్‌ ఎఫక్ట్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

తరచుగా కాఫీ తాగితే, అది మెదడులోని ‘గ్రే మ్యాటర్’ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని, ఫలితంగా ఒత్తిడి నుండి మెదడు కోలుకోవడం కష్టమవుతుందని, అంతేకాకుండా, కెఫీన్ ప్రభావం సుమారు 12 గంటల వరకు ఉండి, గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని డాక్టర్ రవికుమార్ హెచ్చరించారు. ఇటువంటి స్థితిలో  మెదడుకు కావాల్సిన విశ్రాంతి దొరకక క్రమంగా ‘బ్రెయిన్ ఫాగ్’ వంటి సమస్యలకు దారితీస్తుందన్నారు.

మనం తీసుకునే ఆహారంలోని కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరానికి అందకుండా చేయడంలో కాఫీ ‘పోషకాల దొంగ’గా మారుతుందని డాక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. కాఫీలోని కెఫీన్, టానిన్లు పేగుల్లో పోషకాల శోషణను అడ్డుకుంటాయని, ఫలితంగా ఎముకల సాంద్రత తగ్గిపోవడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. అలాగే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి, కడుపు లోపలి పొరలు దెబ్బతినే అవకాశం ఉందని, ఇది జీర్ణక్రియపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.

అతిగా కాఫీ తాగడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మానసిక ఒత్తిడికే కాకుండా, చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా మొటిమలు రావడం, చర్మం తన బిగుతును కోల్పోయి, త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడం లాంటివి జరుగుతాయని డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. మహిళల విషయంలో ఇది మరింత ఆందోళనకరంగా మారుతుందని, అధిక కెఫీన్ వినియోగం వల్ల నెలసరి క్రమం తప్పడమే కాకుండా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ఆందోళన, గుండె దడ లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయన్నారు.

సాధారణంగా చాలామంది బరువు తగ్గడానికి కాఫీ సహాయపడుతుందని  అనుకుంటారు. కానీ రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ తాగితే అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తాయని డాక్టర్ కుమార్ తెలిపారు. అతిగా కాఫీ తాగడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు చేరడం, జీవక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నారు. అంతేకాకుండా నోటిలోని, కడుపులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని ‘లీకీ గట్’ సమస్య వస్తుందన్నారు. ఫలితంగా తిన్న ఆహారం పడకపోవడం, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే  కాఫీని పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యకరమని డాక్టర్ ఎం రవికుమార్ సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్ ‘టారిఫ్’ పిడుగు: మరో దేశంపై ప్రతీకారం?
 

#

Tags : 1

Videos

నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..

పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

AP: నాగమల్లేశ్వరి అరెస్ట్

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో, భారత్ కేంద్రంగా బయటపడ్డ మహా కుంభకోణం

కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా

Photos

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)