Breaking News

గణపతి బప్పా 'మోరియా' వెనుక కథలేంటో తెలుసా?

Published on Tue, 08/26/2025 - 16:46

దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలకు  సన్నద్ధమవుతోంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా సంబరమే. తొమ్మిరోజుల పాటు  గణేష్‌మంటపాల్లో ఊరా, వాడా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు మారు మోగుతాయి. భజనలు కీర్తనల, భక్తిగీతాలతోగణనాయకుడ్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. విజయాలనీయవయ్యా  విఘ్నరాజా అని వేడుకొంటారు.అయితే  గణపతి బప్పా మోరియా  అనే నినాదం ఎలా వచ్చిందో తెలుసా.

అయితే ఈ నినాదంలో మోరియా అనే పదం నినాదంలా ఎలా మారింది. అసలు దీనికి అర్ధం ఏంటి.. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా మోరియా.. మంగల్‌ మూర్తి మోరియా అనే నినాదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారంటే..

15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. మహారాష్ట్రాలోని పుణెకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు.

మోరియా గోసావి 117 సంవత్సరాల వయస్సు వరకు క్రమం తప్పకుండా మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాడు. అయితే వయోభారం కారణంగా ఆయన ఆలయానికి వెళ్లలేకపోకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారట.

అయితే మోరియా నిద్రపోతున్న సమయంలో  స్వయంగా  ఈ విఘ్న నాయకుడు కలలో కనిపించి.. అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని..దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. అలా మోరియా నదికి వెళ్లగా. అక్కడొక వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయంలో గ్రామంలో అందరికీ తెలిసింది.  దీంతో సాక్షాత్తు వినాయకుడు కలలో   కనిపించిన మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అంటే.. గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. అలా ’గణపతి బప్పా మోరియా’ అనే నినాదం కొనసాగుతోందని చెబుతారు. తనివితీరా గణపతి బప్పా మోరియా అని  మొక్కితే సర్వ విఘ్నాలు తొలగి  విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

పురాణ  గాథ
మహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది. పుణెకు 79 కిలోమీటర్ల దూరంలో బారమతీ తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర. పిల్లలు లేనందువల్ల శౌనక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది. సూర్యుడిని మించిన  వేడి పిల్లవాడు జన్మించడంతో అతడిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో దొరికిన  కారణంగా అతడు సముద్ర లేదా సింధురాసురుడగా ప్రసిద్ధికెక్కాడు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం చేసిన తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదించాడనీ, దీంతో  సింధుకు మృత్యుభయం ఉండదని చెబుతారు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడట. ఈ అహంకారంతో దేవతలపైనా, కైలాసం,  వైకుంఠంపైనా దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహా విష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసురుడు ప్రకటించాడు. దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై.. తాను పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని అంతమొందిస్తానని వారితో చెప్పాడట. పన్నెండేండ్లు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి కొడుకుగాపుట్టాడట. ఒకసారి సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. 

అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. ‘మోర్‌’ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకొని వచ్చి సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని.. అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు కొలుస్తుంటారు.  అలా  క్రమంగా ‘గణపతి బప్పా మోరియా’గా ప్రసిద్ధికెక్కింది. ఈ కథను చెప్పేవారికి, విన్నవారికి సమస్త కోరికలు ఫలిస్తాయనిధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుందని  పండితుల ఉవాచ.

నోట్‌ : అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రం. ఇది భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు మీద ఆధారపడి ఉంటాయనేది గమనించాలి.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)