Breaking News

కుమారుడి పెళ్లిలో నీతా అంబానీ చేతిలో మంగళ దీపం: విశేషం ఇదీ!

Published on Sat, 07/13/2024 - 15:05

గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌  అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి వేడుకలో జయమాల ఇతర   ఘట్టాలు విజయవంతంగా ముగిసాయి. దీంతో అధికారంగా రాధిక మర్చంట్‌ అనంత్‌ భార్య, అంబానీ ఇంట చిన్న కోడలిగా అవతరించింది. అయితే ఈ  వివాహ వేడుకలో  వరుడి తల్లి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నీతా  అంబానీ  పట్టుకున్నదీపం హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

నీతా అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చినప్పుడు, సంప్రదాయ రామన్ డివో దీపంతో  కనిపించారు. గుజరాతీ వివాహాలలో రామన్ డివో ఒక ముఖ్యమైన భాగం. గుజరాతీ ప్రజలు ప్రతి శుభ కార్యంలో దీనిని ఉపయోగిస్తారు.  ఆచారాన్ని సంప్రదాయాలను  కచ్చితంగా పాటించే నీతా కూడా వివాహ వేదిక వద్దకు వరుడు తరలి వెళ్లే సమయంలో గణేశ విగ్రహంతో ఉన్న రామన్ దీపాన్ని తీసుకెళ్లాడు. ఇది  చీకటిని పారదోలి, సకల శుభాలు కలుగ జేస్తుందని, కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించే మంగళదీపంగా నమ్ముతారు. 

 ఈ సందర్భంగా తల్లిగా నీతా అంబానీ ఉద్వేగానికి  లోనయ్యారు.  ఈ వివాహానికి వచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. అనంత్‌ రాధిక శాశ్వత బంధంలోకి  అడుగు పెడుతున్న తరుణంలో తన మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందనీ,  భక్తిభావంతో ఉప్పొంగుతోంది అంటూ ఉద్వేగంగా చెప్పారు.  హిందూ సంప్రదాయంలో వివాహం అంటే ఏడేడు  జన్మల వాగ్దానం అని వివరించారు.  గతంలో కూడా  నీతా  ఈ దీప ఆచారాన్ని పాటించారు.  అలాగే పెళ్లికి తరలివెళ్లేముందు తన తాతగారు ధీరు భాయి అంబానీకి ప్రత్యేక నివాళులర్పించాడు  వరుడు అనంత్‌. 

ఈ సందర్భంగా ఫ్యాషన్‌  ఐకాన్‌ నీతా అంబానీ ధరించిన జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అందమైన  పీచ్‌ కలర్‌ సిల్క్ గాగ్రా మరింత ఆకర్షణీయంగా నిలిచింది.  అనంత్‌ పెళ్లి వేడుకల్లో  నీతా ఆనందంతో నృత్యం చేయడం విశేషం. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)