Breaking News

మహిళలూ.. క్రాన్‌బెర్రీ జ్యూస్‌ ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారా?

Published on Thu, 06/06/2024 - 15:56

కుటుంబ బాధ్యతల్లో పడి చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించు కోరు. నిజానికి రుతుస్రావం, గర్భధారణ, పిల్లల పోషణ లాంటి గురుతర బాధ్యతలను నిర్వహించే మహిళలు  ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో  మహిళల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే ఒక జ్యూస్‌ గురించి తెలుసుకుందాం.

క్రాన్‌బెర్రీ జ్యూస్. క్రాన్‌బెర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు  పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి.. ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా  కాపాడతాయి

ఉత్తర , దక్షిణ అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఐరోపాలో ఎక్కుగా సాగు చేస్తారు.   ఎరికేసి కుటుంబానికి చెందిన వీటిని  శాస్త్రీయంగా వ్యాక్సినియం ఆక్సికోకోస్ లేదా వ్యాక్సినియం మాక్రోకార్పన్ అని పిలుస్తారు.  ఇవి పుల్లగా, తీయగా, కొంచెం చేదు కలగలిసిన రుచితో గమ్మత్తుగా ఉంటాయి.

క్రాన్‌బెర్రీ జ్యూస్ ప్రయోజనాలు
నారింజ లేదా యాపిల్  లాంటి  ఇతర జ్యూస్‌ల వలె ప్రాచుర్యం పొందనప్పటికీ, క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  స్వచ్ఛమైన క్రాన్‌బెర్రీ  జ్యూస్‌లో సీ, ఈ విటమిన్లు,  ఫినోలిక్ సమ్మేళనాలు వంటి విలువైన ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వయస్సు-సంబంధిత సమస్యలు,  జబ్బులకు చెక్‌ పెడతాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాలు పేరుకుపోతాయి.  క్రాన్‌బెర్రీ జ్యూస్‌లోని కొన్ని రసాయనాలు యాంటీఆక్సిడెంట్లు వీటిని  అడ్డుకుంటాయి. 

  •  కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధి, జీర్ణ ఆరోగ్యం, మూత్ర నాళం ఆరోగ్యానికి చాలా మంచిది.  
  • క్రాన్‌బెర్రీ జ్యూస్‌లోని వివిధ పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రాన్‌బెర్రీస్‌లో పాలీఫెనాల్స్ అనే రసాయనాలు ఇందుకు తోడ్పడతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న ఆడవారిపై 2011లో జరిపిన అధ్యయనంలో క్రాన్‌బెర్రీ జ్యూస్ రక్త ప్లాస్మాలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతుందని కనుగొన్నారు. 
  • క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను తీసుకునేవారిలో చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి.   గుడ్‌ కొలెస్ట్రాల్‌లెవల్స్‌ పెరుగుతాయి.
     
  • కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారికి క్రాన్‌బెర్రీ జ్యూస్ ఒకబెస్ట్‌ ఆప్షన్‌. గుండె  ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మరో అధ్యయనంలో  తేలింది.
  • ముఖ్యంగా మహిళలు క్రాన్బెరీతో చేసే జ్యూస్ తాగడం వల్ల  యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. అదే విధంగా యూరిన్‌లో వచ్చే మంట, దురదకు ఉపశమనం లభిస్తుంది.
  • శరీరంలో మంట, దురద, చికాకు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఎంజైమ్స్‌ని పెంచుతాయి.
  • రూమటాయిడ్ ఆర్ర్థరైటీస్, కాలిటీస్, ఎథెరోక్లోరోసిన్, అల్జీమర్స్ పెరడెంటైటీస్, డయాబెటీస్ వంటి బారిన పడకుండా కాపాడుతుంది.
  • చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల చర్మానికి, ముఖంలో మంచి మెరుపు వస్తుంది. 
     
  • ఈ జ్యూస్ తాగడం  వల్ల ఫినోలిక్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు బాడీకి మంచి డిటాక్స్ డ్రింక్‌లా పని చేస్తుంది.

    నోట్‌:  కొన్ని పరిశోధనల ప్రకారం వార్ఫరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ , కొన్ని రకాల యాంటి బయెటిక్స్‌ వాడేవారు క్రాన్‌బెర్రీకి దూరంగా మంచిది. వైద్యుల సలహా మేరకుతీసుకోవాల్సి ఉంటుంది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)