బియ్యం నానబెట్టి వండుకుంటే షుగర్‌ పేషెంట్లకు మంచిదేనా?

Published on Tue, 06/11/2024 - 12:50

భారతీయుల ఆహారంలో ప్రధానమైన ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. ఇండియాలో ఎక్కువగా పండించేది, భారత ప్రజలు ఎక్కువగా తినేది బియ్యమే. ప్రతి సంవత్సరం సగటున 125.038 మిలియన్ టన్నుల బియ్యాన్ని భారతదేశం మాత్రమే  ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఊబకాయం, మధుమేహ వ్యాధి బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో రైస్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది ప్రచారంలో ఉంది. 

అయితే బియ్యాన్ని ఉడికించే ముందునీటిలో నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ నేపథ్యంలో బియ్యాన్ని నానబెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.

అనేక అధ్యయనాల ప్రకారం ఏదైనా గింజల్ని నానబెట్టినపుడు వాటిల్లోని పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి. అలాగే బియ్యాన్ని నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బియ్యం నానబెట్టడం దాని గ్లైసెమిక్ సూచిక (GI), పోషకాహార ప్రొఫైల్‌ను ప్రభావితం చేస్తుంది. 

డయాబెటిక్ రోగులు సాధారణంగా అన్నం తినకూడదని సలహా ఇస్తారు.  అయితే బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే జీఐని తగ్గిస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ చేసి జీఐని తగ్గించడంలో సహాయపడుతుంది.  అలాగే నానబెట్టడం వల్ల  సెరోటోనిన్, మెలటోనిన్ విడుదలకు సహాయపడుతుంది.

బియ్యాన్ని నానబెట్టడం వల్ల అదనపు పిండిపదార్థాలు తొలగిపోతాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు ​ కొంతమేరకు ఉపయోగపడుతుంది. 

పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది
బియ్యం నానబెట్టడం వల్ల పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ పద్ధతిని ఉపయోగించి బియ్యంలో ఉండే ఫైటోకెమికల్స్, టానిన్‌లను విచ్ఛిన్నం చేయవచ్చు. అలాగే విటమిన్లు. ఖనిజాల జీవ లభ్యత పెరుగుతుంది.ఇది అన్నం సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

ఉడికించే ముందు బియ్యాన్ని  నానబెట్టిడం ద్వారా  క్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సాధారణ చక్కెరగా మార్చడానికి సహాయ పడుతుంది.  శరీరంలో ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

వంట సమయాన్ని తగ్గిస్తుంది
అంతేకాదు బియ్యాన్ని నీటితో నానబెట్టడం వల్ల వండే సమయం కూడా తగ్గుతుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల గింజలు మెత్తబడి సులభంగా ఉడుకుతాయి. దీంతో వంట ఖర్చు కూడా ఆదా అవుతుంది.

నోట్‌: ఇది అవగాహనా సమాచారం మాత్రమే.  షుగర్‌ వ్యాధి  జీవనశైలితోపాటు అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. 
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)