Breaking News

గొంగడి గురించి తెలుసా? ఇంతకుముందెప్పుడూ వినని విశేషాలు!

Published on Sat, 10/11/2025 - 11:55

పిల్లలూ! ‘గొంగడి’ గురించి మీకు తెలుసా? మీ ఇంట్లో గొంగడి ఉందా? ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గొంగడి ఉండేది. వ్యవసాయ, పాడి ఆధారిత కుటుంబాల్లో తప్పకుండా కనిపించే వస్తువు ఇది. ప్రస్తుతం పట్టణాల్లో దీని వాడకం తగ్గినా పల్లెల్లో ఇంకా వాడుతున్నారు.

ముఖ్యంగా పశువుల కాపర్లు జీవాలను మేతకు తీసుకువెళ్లే సమయంలో గొంగడిని తమ వెంట తీసుకువెళ్తుంటారు. భారతదేశానికి వస్త్ర పరిశ్రమ రంగంలో గొంగడికి కీలకమైన స్థానం ఉంది. గొంగడి అనేది ఉన్నితో తయారు చేసిన దుప్పటి. మరాఠీలో దీన్ని ‘ఘొంగడి’ అంటారు. దీన్ని చేత్తో తయారు చేస్తారు. దీనికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక విలువలు ఉన్నాయి. గతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో వివాహ ప్రతిపాదనలు ఏర్పాటు చేసేటప్పుడు గొంగడిని వినియోగించేవారు.ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూర్చోడానికి, విశ్రమించడానికి దీన్ని వాడేవారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణగా నిలిచేందుకు ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షంలో ఈ గొంగడి కప్పుకుంటే గొంగడి తడిసిపోయినా లోపలున్నవారికి ఆ తడి తగలదు. అది గొంగడి విశిష్టత.

చదవండి: కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె

మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో అతిథులను స్వాగతించడానికి నేటికీ ఈ గొంగడిని ఉపయోగిస్తారు. అతిథుల్ని గొంగడిపై కూర్చోబెట్టడం గౌరవప్రదంగా భావిస్తారు. జూన్‌–ఆగస్టు నెలల మధ్య గొంగడి తయారీ ప్రారంభమవుతుంది. ఈ నెలల్లో గొర్రెల నుండి ఉన్నిని తీస్తారు. దాన్ని రంగుల ఆధారంగా వేరు చేస్తారు. సాధారణంగా ఉన్ని నలుపు, తెలుపు, గోధుమ రంగులలో ఉంటుంది. ఇందులో తెల్ల రంగు గొంగడి చాలా అరుదుగా కనిపిస్తుంది. 8 అడుగుల గొంగడిని తయారు చేయడానికి 350 గజాల ఉన్ని అవసరం. 10, 12 అడుగుల గొంగడికి 400, 450 గజాల ఉన్ని అవసరం అవుతుంది. చేతి మగ్గంపై ఒక గొంగడిని నేయడానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది. నేయడం పూర్తయ్యాక దుప్పటికి చింతపండు గింజల రసం పూసి, రెండు నుండి మూడు రోజులు ఎండలో ఉంచుతారు. ఆ తర్వాత గొంగడి వినియోగానికి సిద్ధమైనట్లే.

చదవండి: 5 నిమిషాల్లో జాబ్‌ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!

 

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)