Breaking News

దీపావళి వేళ, ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!

Published on Thu, 10/16/2025 - 14:51

దివ్యమైన దీపావళి పండగ  సంబరాలను సమయం మరెంతో దూరంలో లేదు.  ప్రతీ ఏడాది  అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి ​ కూడా ఒకటి.  ధంతేరస్‌, నరక  చతుర్ధశి (ఛోటీ దీపావళి), దీపావళి, యమ విదియతో దీపావళి పండుగ ముగుస్తుంది.

దీపావళి పండుగ  రోజు  లక్ష్మీదేవిని, గణపతి, కుబేరడిని విశేషంగా పూజించడం ఆనవాయితీ. దీనికి అనేక పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సత్యభామ సాయంతో  శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించడం,  14 సంవత్సరాల వనవాసం నుండి రాముడు తిరిగి వచ్చిన వేళ దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారని కూడా  చెబుతారు.

కొత్త బట్టలు, లక్ష్మీ, గణపతి: అయితే దీపావళి రోజు లక్ష్మీదేవితోపాటు,గణపతి ప్రతిమలను తెచ్చుకొని  కొలిస్తే సిరిసంపదలకు లోటు  ఉండదని నమ్మకం. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. కొత్త బట్టలు, దీప కాంతులతో పాటు దీపావళి పండుగ రోజు కొన్ని వస్తువులను తీసుకొని రావడం శుభప్రదంగా పరిగణిస్తారు.  తద్వారా  సంపద కలిగి శ్రేయస్సు  లభిస్తుందని  భావిస్తారు.ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులను కొనుగోలు చేయడం శుభప్రదమని, అంతా మంచే జరుగుతుందట.

చదవండి: Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!

తాబేలు: విష్ణుమూర్తికి ప్రతిరూపమైన తాబేలు ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఆర్థికాభివృద్ధితోపాటు ఇంటిల్లిపాదికీ పాజిటివ్‌ ఎనర్జీ ఇస్తుందని నమ్ముతారు.శ్రేయస్సుకు, సంపదకు  సంకేతమైన కొబ్బరికాయను తెచ్చుకుంటారు. దీంతో స్వయంగా లక్ష్మీదేవి కొలువుదీరినట్టే అంటారు. ముందు రోజు తెచ్చుకున్న కొబ్బరికాయను, దీపావళి రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నివేదిస్తారు.

 (Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!)

తులసి : ఇక తులసి మొక్క గురించి ప్రత్యేకంగా  చెప్పేదేముంది. గాలిని శుభ్రం చేసే తులసి  ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీపావళి రోజున తులకి మొక్కను ఇంటి ముందు ప్రతిష్టించు  భక్తితో పూజిస్తేఅంతా శుభం  కలుగుతుంది అంటారు. 
దాన ధర్మాలు 
దీపావళి రోజు మనకు మనమే సంబరాలు చేసుకోవడం కాకుండా, పేదవారికి లేనివారికి దానాలు  చేస్తే ఆరోగ్య వృద్ధి, ఆయు వృద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతారు.  నమ్ముతారు.  కొత్తబట్టలు, ఆహార ధాన్యాలు, తెల్లని వస్త్రాలు, చీపురు, పంచదార, బెల్లం, బియ్యం దానం చేస్తే అంతాశుభాలు జరుగుతాయంటారు. 

నోట్‌ : ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు వారి వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటాయి.  ఈ సమాచారం కేవలం అవగాహన కోసం అందించినది మాత్రమే.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)