Breaking News

దివాలీకి స్వీట్లు లేకపోతే ఎలా? ఈజీగా ఇలా చేసేయ్యండి!

Published on Sat, 10/18/2025 - 13:53

ముచ్చటగా అలంకరించిన లోగిళ్లు అందంగా ముస్తాబైన చిన్నా పెద్దలుఓ వైపు దీప కాంతులు మరోవైపు బాణాసంచా పేలుళ్లు ఆనందాలు విప్పారుతుండగా తియ్యని రుచులు నోరారా ఆస్వాదిస్తుంటే వేడుకంతా నట్టింట్లో కొలువుదీరినట్టే ఉంటుంది. రెట్టింపు ఆనందాలను పంచడానికి వంటిల్లు తీపి వంటకాలను  సిద్ధం చేస్తూనే ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా పండగవేళ  తియ్యని రుచులను సులువుగా చేసేద్దాం. ఇంటిల్లి పాదికీ ఆనందాన్ని పంచేద్దాం..

సూజీ హల్వా 
కావలసినవి: సూజీ (బొంబాయి రవ్వ) – కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – కప్పు; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; యాలకుల  పొడి – పావు టీ స్పూన్‌; జీడిపప్పు, కిస్‌మిస్‌ – అవసరమైనంత.

తయారీ: పాన్‌లో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు, ద్రాక్ష వేయించాలి. ∙వాటిని తీసి, అదే నెయ్యిలో సూజీ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ∙మరో పాత్రలో నీరు మరిగించి, రవ్వ పోస్తూ, కలపాలి. ∙రవ్వ ఉడికిన తర్వాత పంచదార కలిపి తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ∙చివరగా వేయించిన కాజూ, ద్రాక్ష వేసి మిక్స్‌ చేయాలి.

గులాబ్‌ జామూన్‌
కావలసినవి:  రెడీమేడ్‌ జామూన్‌  మిక్స్‌ – కప్పు; నీళ్లుపాలు – అవసరమైనంత (జామూన్‌ మిక్స్‌ కలపడానికి); పంచదార‡ – ఒకటిం΄ావు కప్పులు; నీళ్లు – కప్పు; యాలకుల పొడి – చిటికెడు.

తయారీ: ∙పంచదార, నీళ్లు కలిపి, మరిగించి సిరప్‌ తయారు చేయాలి. దాంట్లో చిటికెడు యాలకుల పొడి కలపాలి ∙జామూన్‌  మిక్స్‌కి కొంచెం నీళ్లు లేదా పాలు జోడించి మృదువుగా కలపాలి ∙మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి ∙బాణలిలో నూనె పోసి వేడయ్యాక, సిద్ధంగా ఉంచుకున్న ఉండలు వేసి, వాటిని గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి ∙వేయించిన జామూన్లను వేడి సిరప్‌లో వేసి, రెండు గంటలు నాననివ్వాలి.

రైస్‌ పుడ్డింగ్‌ / పాయసం
కావలసినవి: బియ్యం – పావు కప్పు; పాలు – 3 కప్పులు; పంచదార –  పావు కప్పు; యాలకుల  పొడి – పావు టీ స్పూన్‌; యాలకులు, కిస్‌మిస్‌ – అవసరమైనంత; నెయ్యి – టేబుల్‌ స్పూన్‌.

తయారీ : బియ్యం కడిగి, కొద్దిగా ఉడికాక పాలు పోసి, మెల్లిగా మరిగించాలి. బియ్యం పూర్తిగా ఉడికాక పంచదార కలపాలి. యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి కలపాలి.

బేసిన్‌  లడ్డూ 
కావలసినవి:  బేసన్‌  (సెనగపిండి) – కప్పు; నెయ్యి – పావు కప్పు; పంచదార  పొడి –  పావు కప్పు; యాలకుల పొడి –  పావు టీ స్పూన్‌.

తయారీ:  ప్యాన్‌ నెయ్యి వేసి, వేడి చేయాలి. మంట బాగా తగ్గించి, దాంట్లో శనగపిండి వేసి, మెల్లగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత పంచదార పొడి, యాలకుల   పొడి వేసి కలపాలి. మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, చేతులతో లడ్డూలు చేయాలి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)