Breaking News

చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేల పంపిణీ, ఆనందోత్సాహాల్లో భక్తులు

Published on Tue, 10/21/2025 - 16:10

 అటు దేశవ్యాప్తంగా, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.  చిన్నాపెద్దా కులమత భేదాలు లేకుండా వెలుగుల పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు.  ఆలయాలు సర్వాంగ సుందరంగా విద్యుద్దీప కాంతులతో వెలిగిపోయాయి. అయితే తెలంగాణా,హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి సంబరాలు ఎప్పటిలాగానే విశేషంగా నిలిచాయి.

వెండి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్‌  వద్ద కొలువై ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికొలువైన ఉన్న వెండి నాణేలను పంపిణీ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా  సంపదకు మారుపేరైన అమ్మవారిని దర్శించుకున్న మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా   ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలు పంపిణీ చేశారు.

మహాహారతి తరువాత ఏడాదంతా అమ్మవారి  ఖజానాకు భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాణేలను దీపావళి రోజు భక్తులకు పంపిణీ  చేయడం ఆనవాయితీ. ఈక్రమంలో ఈ ఏడాది కూడా వెండి నాణెలు పంపిణీ చేసినట్లు ఆలయ ట్రస్టీ వివరించారు. అలాగే ఈ హారతి మూడు రోజుల పాటు జరుగుతుందని  తెలిపారు.

కాగా భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్వీట్‌ చేశారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)