Breaking News

పెద్దమ్మ గుడిలో ఈ–హుండీ..

Published on Tue, 10/14/2025 - 10:21

ప్రస్తుతం అంతా డిజిటల్‌ యుగం నడుస్తోంది.. బస్‌ టికెట్‌ కొనాలన్నా.. వాటర్‌ బాటిల్‌ కొనాలన్నా.. అన్నింటికీ యుపిఐ పేమెంట్సే.. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో చిల్లర కొరత ఏర్పడుతోంది.. ప్రతి కొనుగోలుకీ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం అలవాటైపోయింది. నూటికి 60 శాతం పైగా పేమెంట్స్‌ ఈ తరహాలోనే నడుస్తున్నాయి. దీంతో అత్యవసరమైన చోట ఖర్చు చేసేందుకు కూడా జేబులో రూ.10 ఉండని పరిస్థితి. ఈ ప్రభావం దేవాలయాలపై భారీగా కనిపిస్తోంది. 

దీంతో ఈ సమస్యకు ప్రత్యామ్నాంగా దేవాలయాల్లోనూ ఇటీవల కాలంలో హుండీ ఆదాయం గణనీయంగా పడిపోతోందని దేవాదాయ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు నగరంలోని జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మ దేవాలయంతో పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్‌ గణేష్‌ టెంపుల్, మహంకాళి దేవాలయం, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో ఈ–హుండీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 

తాజాగా నగరంలోనే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మ ఆలయంలో ఈ–హుండీ ఏర్పాటైంది. సోమవారం నుంచి భక్తులకు ఈ–హుండీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు ఇక్కడ స్కాన్‌ చేసి కానుకలను నేరుగా ఆలయ అకౌంట్‌లోకి పంపించవచ్చు. 

మొదటి రోజు ఈ విధానానికి భారీ స్పందన లభించింది. మిగతా ఆలయాల్లోనూ ఈ–హుండీలను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఆయా ఆలయాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.  

(చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్‌ పిక్నిక్‌కి అదే రూటు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)