Breaking News

'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే..

Published on Fri, 07/24/2026 - 18:45

శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలమే చాతుర్మాసం. ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని  దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి) అంటారు. దీని అర్థం. దేవ్' అనగా దేవుడు, 'శయని' అనగా నిద్రించుట. విష్ణుమూర్తి క్షీరాసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజే ఈ దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు గల నాలుగు నెలల కాలం చాతుర్మాసంగా పరిగణిస్తారు. అంటే ఈ నాలుగు మాసాల్లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా, సృష్టి బాధ్యతలను పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. 

చాతుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మశుద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, మొదటి పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయరు. అయితే, భక్తి, దానధర్మాలతో కూడిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఎలా ఆరాధించాలంటే..

విష్ణు అనుగ్రహం కలగాలంటే..
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అంతేగాదు మహాసాధ్వి సతీ సక్కుభాయి, ఈ వ్రతాన్నే ఆచరించి, మోక్ష సిద్ధి పొందటం జరిగింది. 

వ్రతంలోని ప్రధాన నియమాలు..
ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.  అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం, శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. 

తినకూడనవి..
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించారు. 

అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

(చదవండి: వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!)
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)