Breaking News

నమ్మినోల్లకు నమ్మినంత

Published on Mon, 08/11/2025 - 09:57

అదొక పల్లెటూరు. ఊరి వెనుక ఒక పెద్ద గుట్ట ఉంది. ఊర్లోని ఒక భక్తుడికి ఆ గుట్టపైన గుడి కట్టాలనిపించింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గుడి  నిర్మాణం  పూర్తి చేశాడు.గుడి పక్కనే ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకుని తల్లితో పాటు అక్కడే నివాసం ఉండే వాడు. గుడి, ఊరికి దూరంగా ఉండటంతోను, కష్టపడి గుట్ట ఎక్కాల్సి రావడంతోనూ  గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు.

ఆ భక్తుడిలో బాధ, భయం మొదలయ్యాయి. కొండంత భారం మోయలేకపోతున్నానని తల్లితో చెప్పుకుని ఏడ్చాడు. అతడి బాధ చూసి ఆమె ‘కష్టాలు కలకాలం కాపురముండవు. మనకూ మంచి రోజులు వస్తాయి. నమ్మినవాళ్ళని భగవంతుడు ఎన్నటికీ విడిచి పెట్టడు’ అని ధైర్యం చెప్పేది.

పైకి గంభీరంగా ఉన్నా ఆమెలో కూడా బాధ లేకపోలేదు. హారతిపళ్ళెంలో పడే పైసలు చమురు ఖర్చులకే రావడం లేదని లోలోపలే ఆందోళన చెందేది. ‘అయినా ఇది దైవసేవ. దేవుడే మనకు దారి చూపుతాడు’ అని గట్టిగా నమ్మేది.

ఒకరోజు ఆమె గుడిపూజ సామానులు శుభ్రంగా  కడిగి ఎత్తి పెడుతున్న సమయంలో హారతి పళ్ళెం గుట్ట బండరాయి మీద పడింది. పళ్ళెం పడిన చోట ఒక వీనుల విందైన రాగం ఆమెకు వినిపించింది. ‘ఇంతలో అయ్యో... పళ్ళెం సొట్టబోయిందే..’ అని బాధపడుతూ వచ్చాడు కొడుకు. కానీ ఆమె అలాగే బండరాయి మీద కూర్చుని చిన్న రాయి తీసుకుని కొట్టసాగింది. ఉన్న పళ్ళెం సొట్టపోయిందని బాధపడుతూ ఉంటే నువ్వేమి చేస్తున్నావని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వింది. గుడి చుట్టూ ఉన్న బండరాళ్ళను రాతితో కొట్టి చూడసాగింది. తల్లి చేష్టలను వింతగా చూడసాగాడు కొడుకు. ఆమె గట్టిగా ‘‘మన కష్టాలు తీరిపోయాయి. గుడి పోషణ ఇక సులభం’’ అని చెప్పింది. ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరికి వెళ్ళి ‘ఎలా?’’ అని అడిగాడు. ‘‘ఈ బండ రాళ్ళను కొట్టి చూస్తే, సరిగమపదనిసలు పలుకుతున్నాయి. వెంటనే శిల్పకళ గురువు స్థపతిని పిలిపించు. సప్తస్వరాల్లోని ఒక్కో రాగం పలికే బండను ఎంపిక చేసి వరుసగా పెట్టించాలి. ఆ రాగాలను పలికించడానికి ఒక రాయిని అందుబాటులో ఉంచాలి. వచ్చిన భక్తులు ఆసక్తిగా వీటిని కొట్టి సంతోష పడతారు’’ అని చెప్పింది. మారుమాట్లాడకుండా తల్లి చెప్పినట్లే చేశాడు.

ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టూ ఉన్న గ్రామాలకు  చేరింది. మొదట పిల్లలు, ఆ తర్వాత యువకులు, చిన్నగా ఊరిజనం, చుట్టుపక్కల గ్రామస్తులూ గుట్ట ఎక్కడం ప్రారంభించారు. దైవ దర్శనం చేసుకుని సరిగమలు పలికిస్తూ సంతోషపడసాగారు. గుడి ఆదాయం చిన్నచిన్నగా పెరగసాగింది. తల్లీకొడుకు దేవుడికి నమస్కరిస్తూ ‘నమ్మినోల్లకు నమ్మినంత’ అనుకున్నారు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)