Breaking News

Basaveshwarudu: బసవ బోధ

Published on Sat, 06/28/2025 - 17:49

సమాజంలో నెలకొన్న దురాచారాలను, మూఢ విశ్వాసాలను సమూలంగా నిర్మూలించి జనులను సన్మార్గంలో నడి పించి ఉద్ధరించాలని తపించి ఆ ప్రయత్నంలోనే తనువులను బాసిన మహనీయులెందరో! వారిలో బసవేశ్వరుడు ఒకరు. బసవేశ్వరుడు క్రీ.శ. 1131లో కర్ణాటకలో జన్మించాడు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో ఉపనయనం చేయదలచిన తల్లితండ్రులతో, ‘అక్కకు లేని ఉపనయనం నాకెందుకు?’ అని ప్రశ్నించాడు. సదాచారం, సత్ప్రవర్తన లేని జీవితం వ్యర్థమనీ, చిత్త శుద్ధి దైవ సాక్షాత్కారాన్ని కల్గి స్తుందనీ చాటి చెప్పాడు. బస వేశ్వరుని అపారమైన మేధను గమనించి కల్యాణ కటకాన్ని పాలించే ఆనాటి రాజు బిజ్జ లుడు ఆయనను తన రాజ్యంలో మహామంత్రిగా నియ మించాడు. కేవలం శాసించటానికే పరిమితమైన రాజ సభను ప్రజాసమస్యలను పరిష్కరించే వేదికగా ‘అనుభవ మంటపం’గా ఆయన తీర్చిదిద్దాడు. ‘కాయకమే కైలాసం’ అనే  సిద్ధాంతాన్ని బోధించి ప్రజలను కార్యకర్తలుగా, కార్య దక్షులుగా మలిచాడు. తాము చేసే పనిని శ్రద్ధతో చేయ టమే అసలైన పూజ అని తెలియజెప్పాడు.

మానవులంతా సమానమే, శివుడే సత్యం, ఆయన నిరాకారుడు, ఖరీదైన ఆలయాలు, అలంకారాలు వద్దు, వాస్తు – జ్యోతిషాలు అసత్యాలు, భక్తి కన్నా సత్ప్రవర్తన మిన్న అని పదేపదే గొంతెత్తి చెప్పాడు. వేటగాడైన కన్నప్ప, పారిశుద్ధ్యపు పని చేసిన మేదర చెన్నయ్య, అంటరాని వాడైన సిరియాళుడు ఎలా ముక్తి పొందగలిగారో వివరించాడు. కులాంతర వివాహాలను, సహపంక్తి భోజనాలను బసవేశ్వరుడు ఆనాడే ప్రోత్సహించి సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. ఇలాంటివి నచ్చని సంప్రదాయవాదులు కుట్ర పన్నారు. అయినా వాటిని ఎదుర్కొంటూ ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తూనే శివైక్యం చెందాడు.
– రాచమడుగు శ్రీనివాసులు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)