Breaking News

ఇలా అయితే వేదన తప్పదు : అదే నీవు... అదే దైవం!

Published on Mon, 06/23/2025 - 09:57

దైవం ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో నీవు ఎక్కడ ఉన్నా సరే, ఏమి చేస్తున్నాసరే ఆత్మస్థితిలోకి వెళ్ళగలవు. అదే దివ్యచైతన్యం. అదే నీవు, అదే దైవం. ఆ సమాధి స్థితి దైనందిన జీవితంలో నిరంతరం ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మదర్శనంలోనే ఉండాలి. చూసేవాడివే నీవు, శరీరానికి, మనస్సుకు ఏమి జరుగుతున్నా సరే సంపూర్ణంగా స్వీకరించు, వాటికి అంటకుండా దూరంనుంచి గమనిస్తూ ఉండు. విషయాలను తర్కించి, జరుగుతున్నది మంచేనా లేక చెడా అని రకరకాలుగా అలోచిస్తూ సంస్కారాలను పెంచుకోవద్దు. జరుగుతున్నది ఏదైనా సరే నీవు సాక్షిగా చూస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. అదే నిన్ను మనస్సుకు అతీతంగా తీసుకెళ్తుంది. శరీరము–మనస్సులకు జరుగుతున్న వాటితో కలిసిపోయావంటే వేదనలను అనుభవిస్తావు. జరుగుతున్న వాటిని సాక్షిగా గమనిస్తే ఆత్మలోని అనందమే నీవు అవుతావు. దుఃఖించేవాడివి నీవు కాదు, దుఃఖించేవాడిని గమనించేవాడివే నీవు. 

ఇలాంటి జీవనశైలిని అలవర్చుకుంటే నిత్యం సచ్చిదానందంలో ఉంటావు. అది నొప్పిఐనా, అవమానమైనా, సంతోషమైనా, విజయమైనా, ప్రశంసైనా.... ఏదైనాసరే నీకు అంటకూడదు. సమభావంతో స్వీకరించు, సాక్షిగా గమనించు. సత్యం నీలో ఉంది. దేన్ని వెంబడించినా ఆనందం రాదు గుర్తుంచుకో. అన్నింటిలోనూ జీవించు కానీ వేటితోనూ కలిసిపోవద్దు. ఆధ్యాత్మికంగా ఉండడమంటే కోరికల్ని అణిచివేయడమని, కొన్ని పనుల్ని చేయకూడదని, సంసారాన్ని త్యజించడమని, హిమాలయాలకు వెళ్ళడమని కొందరు చెప్పే అజ్ఞానపు  పోకడలను అనుసరించవద్దు. అసలు జరుగుతున్నదేదీ సత్యం కానపుడు దాన్ని వదిలేయడం ఏమిటి? నీవే దైవమైనప్పుడు దేన్ని వదిలేయాలి? మనస్సుతో మాత్రం ఎప్పుడూ ఏకమవ్వద్దు. మనకున్న నమ్మకాలు, భయాలు, అ΄ోహలు అన్నీ మనస్సు వల్లనే. సత్యాన్ని తెలుసుకోనీయకుండా చేసేది మనస్సే. నీవు సాక్షివైనప్పుడే మనస్సు అంతమవుతుంది. అలోచనలు లేని శుద్ధ చైతన్యం అనుభవమౌతుంది.

చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలు

బుద్ధుడు, మహా వీరుడు మొదలైన యోగులు కూడా దేవుడు భౌతికమని ఎన్నడూ చెప్పలేదు. సత్యమే దైవం. అదే నీ నిజస్థితి. దేవుడు అనేది నీచివరి మజిలీ. దైవాన్ని నమ్మడం అనేది దైవాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఏమాత్రం సహకరించదు. పైగా నమ్మకమే దైవాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడుతుంది. నమ్మకాలనేవి నీ మనస్సులోని ఊహలే. సత్యాలు మాత్రం కావు. దైవాన్ని తెలుసుకోవడానికి ఏ క్రతువులు, భాషలు అవసరమే లేదు. కానీ ఈ రోజు ప్రతి మతంలోనూ మనస్సు తాలూకు నమ్మకాలు, అలవాట్లు అనేవే ఉన్నాయి కానీ నిన్ను నీవు తెలుసుకోవడం, సాక్షీభావనతో ఉండడం అనే అంశాలే ఉండటం లేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, గ్రంథాలు చదివినా అది మన అహంకారాన్ని  పోషించి మనస్సును ఇంకా బలపరచి సత్యానికి అడ్డుగోడలు కడుతుందే కానీ సత్యాన్ని తెలుసుకోనివ్వదు. నిన్ను నీవు తెలుసుకోనివ్వకుండా అడ్డుపడేది మనస్సే. రోజాపువ్వు గురించి తెలుసుకున్నంత మాత్రాన నీవు ఆ రోజాపువ్వుని ఆస్వాదించలేవు. ఒక విషయం గురించిన జ్ఞానం ఆ విషయానుభవానికే అడ్డమవుతుంది. మనస్సు నిన్ను సత్యాన్ని తెలుసుకోనివ్వదు. ఆనందాన్ని అనుభవించ నీయదు. ఏదో ఒక కొత్త సమస్యను, కోరికను సృష్టిస్తూ, ప్రశ్నిస్తూ, ఈ క్షణాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది. ఆనందం మనస్సుకు అతీతమైన స్థితి కనుక అక్కడికి నిన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూనే ఉంటుంది. దీని ఉచ్చునుండి బయటపడడానికి అనుక్షణం నీవు సాక్షీభావనతో నిన్ను నీవు గమనిస్తూ ఉండాలి. చేతనలో ఉండాలి.  చేతన అనేది మనస్సుకాదు కానీ మనస్సు ద్వారా ప్రవహిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. నిత్యజీవితంలో 
ఈ సాక్షీభావన అనేది సాధన చేయటం చాలా ముఖ్యం. 

ఇదీ చదవండి: Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
 

– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)