Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Breaking News
లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం?
Published on Thu, 11/13/2025 - 10:56
సిరిసంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని వర్ణించే ప్రతి చిత్రంలోనూ లేదా విగ్రహంలోనూ కమలం తప్పక ఉంటుంది. ఆమె కమలంపై కూర్చుని ఉండటం చేతిలో కమలం ధరించి ఉండటం మనం చూస్తాం. దీని వెనుక పురాణ గాథలు, ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో వచ్చింది.
అందుకే ఆమెను ‘క్షీర సాగర కన్య’ అని, అలాగే కమలంతో ముడిపడి ఉంది కాబట్టి ‘పద్మ’ ‘కమల’ ‘పద్మప్రియ’ వంటి పేర్లతో పిలుస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే కమలం అనేది పరిశుభ్రతకు. వైరాగ్యానికి గొప్ప చిహ్నం. కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో లేదా మురికి కొలనులో పెరుగుతుంది. కానీ ఆ బురదలోని ఒక్క అణువు కూడా కమలాన్ని అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా నిర్మలంగా వికసిస్తుంది. ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మార్చింది.
ఇక్కడ దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే. సంపద, ధనం అనేది ‘బురద’ వంటి ఈ లోక వ్యవహారాల మధ్యే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ, ఆ ధనమదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు. కమలంలాగే, ఈ ప్రపంచంలో ఉన్నా, దానికి అంటకుండా పరిశుద్ధంగా, నిర్లిప్తంగా జీవించాలి.
ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి, దానిలో మునిగిపోకూడదు. కమలంపై కూర్చునే లక్ష్మీదేవి ‘‘నీ సంపదను ధర్మ మార్గంలో ఉంచు, దానిపై వ్యామోహం పెంచుకోకు’’ అని పరోక్షంగా చెబుతుంది. అందుకే ఆధ్యాత్మిక సంపద మరియు భౌతిక సంపద రెండింటికి చిహ్నంగా కమలం ఆమెతో నిరంతరం ఉంటుంది.
(చదవండి: Kalabhairava Swamy Temple: నమోస్తు కాలభైరవా!)
Tags : 1