Breaking News

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

Published on Thu, 11/05/2026 - 18:14

గుడికి వెళ్లగానే దైవదర్శనం తర్వాత మన అడుగులు సహజంగానే హుండీ వైపు పడతాయి. భక్తితో, మన స్తోమతను బట్టి కొంత సొమ్మును అందులో వేసి చేతులు జోడిస్తాం. అసలు గుడిలో దానధర్మాలు చేయడం, హుండీలో కానుకలు సమర్పించడం అనే ఆచారం ఎప్పుడు మొదలైంది..? దీనివెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి..?

అహంకార విసర్జన.. మమకార ఛేదన..
సనాతన ధర్మంలో ‘దానం’ అనేది ఒక విశిష్టమైన సాధన. ఆలయంలోని హుండీలో డబ్బు వేయడం అంటే కేవలం ఆ గుడికి విరాళం ఇవ్వడం కాదు; మనలోని ’నాది’ అనే అహంకారాన్ని దేవుని సన్నిధిలో వదిలిపెట్టడం. సంపద మీద మనిషికి ఉండే వ్యామోహాన్ని, మమకారాన్ని కాస్తయినా తగ్గించుకుని, ’అంతా నీదే స్వామీ’ అని లోబడే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది.

హుండీ ఆచారం ఎలా మొదలైంది..?
ఆలయాల్లో కానుకలు సమర్పించే సంప్రదాయం ఫలానా రోజున, ఫలానా చోట ప్రారంభమైందని కచ్చితంగా చెప్పలేం. ప్రాచీన కాలంలో ఆలయాల నిర్వహణకు, నిత్యాన్నదానాలకు, ఉత్సవాలకు ప్రజలు ధాన్యం, పశువులు, వస్త్రాల రూపంలో విరాళాలు ఇచ్చేవారు. కాలక్రమేణా ఆలయాల వ్యవస్థాగత నిర్వహణ పెరగడంతో, భక్తులు తమ కానుకలను భద్రంగా సమర్పించేందుకు వీలుగా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ’హుండీ’ని ఏర్పాటు చేయడం మొదలైంది.

సామాజిక సేవకు వారధి..
భక్తులు సమర్పించే ఈ విరాళాలు దేవుడి కోసం కాదు, దేవుని పేరుతో జరిగే ధార్మిక కార్యక్రమాల కోసం..! ఆలయ నిర్వహణ, నిత్యాన్నదానాలు, వేద పాఠశాలల పోషణ, గోశాలల సంరక్షణ, ఆపదలో ఉన్నవారికి సాయం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ ధనాన్ని వినియోగిస్తారు. అంటే, మనం భగవంతుడికి ఇచ్చేది తిరిగి సమాజంలోని పదిమందికి సేవ రూపంలో చేరుతుందన్నమాట.

మారుతున్న పద్ధతులు.. మారని తత్వం..
ఒకప్పుడు ధాన్యం, ఆ తర్వాత రాగి కాసులు, నోట్లు.. ఇప్పుడు ఆన్‌లైన్‌ పేమెంట్లు, క్యూఆర్‌ కోడ్‌లు, రసీదుల ద్వారా విరాళాలు..! కాలంతో పాటు దానం చేసే పద్ధతులు, రూపాలు మారవచ్చు కానీ, భక్తుని మనసులోని ’సమర్పణ భావం’ మాత్రం ఒకటే. హుండీ అనేది కేవలం డబ్బులు దాచే పెట్టె కాదు.. అది భక్తుల సేవా భావానికి, పరోపకారానికి, దైవం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసానికి సజీవ సాక్ష్యం. దేవుడికి మనం ఏది ఇచ్చినా స్వచ్ఛమైన మనసుతో ఇచ్చినప్పుడే ఆ దానానికి సంపూర్ణ సార్థకత చేకూరుతుంది.
– పసుపులేటి శ్రీలక్ష్మి 

ఇదీ చదవండి: కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

#

Tags : 1

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)