Breaking News

చూసే దృష్టిని బట్టే మంచైనా..చెడైనా..!

Published on Mon, 10/13/2025 - 14:17

తమిళనాడు రాష్టం తిరుచ్చిలోని ఒక ఆడిటర్‌కి ఇద్దరు మగపిల్లలు. కవలలైన వారిద్దరూ ఫిజియో థెరపీ కోర్సు చేశారు. స్వంతంగా క్లినిక్‌ ప్రారంభించాలని అనుకున్నారు. లక్షలు ఖర్చుపెట్టి భవనాన్ని నిర్మించారు.

క్లీనిక్‌ ప్రారంభించేముందు తిరుమలకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని తిరుమల బయలుదేరారు. కొండమీద ఇసుక రాలనంత జనం ఉంది. వరాహస్వామి దర్శనం చేసుకుని ఓపికగా క్యూలో నిలబడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో దేవస్థానం వారు అందించిన వేడివేడి పాలు తాగారు. చిన్న చిన్నగా క్యూ కదిలింది.

‘కష్టపడి చదివాము, భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది’ అని కొడుకులిద్దరూ తండ్రితో చె΄్పారు. ‘‘ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ధైర్యంగా ఉండండి’’ అని బదులిచ్చాడు తండ్రి.
ఇంతలో జనం తోసుకోవడం ప్రారంభమయ్యింది. మహాద్వారం వరకు ఒక్కటిగా వచ్చిన ముగ్గురూ వేరయ్యారు. విడివిడిగా దర్శనానికి వెళ్ళారు.

ఆరోజు గురువారం కావడంతో మూలవిరాట్టు పైన నగలేమీ  లేవు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చకర్పూరపు నామాన్ని అర్చకులు బాగా తగ్గించి ఉన్నారు. అందువల్ల భక్తులకు శ్రీవారి నేత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేత్ర దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించి ఉచిత ప్రసాదం ఇచ్చే చోట ముగ్గురూ కలిశారు. చిన్న లడ్డులు అందుకున్నారు.

‘‘ఎలా జరిగింది దర్శనం?’’ అని తండ్రి ఇద్దరినీ అడిగాడు. పెద్దబ్బాయి ముఖం నల్లగా పెట్టి ‘‘దర్శనమైతే అయ్యింది కానీ, జనం నన్ను తొక్కేశారు. ఒళ్లంతా హూనమయ్యింది’’ అని బదులిచ్చాడు. చిన్నబ్బాయి మెరుపు ముఖంతో ‘‘స్వామి దర్శనంతోపాటు ఒళ్ళంతా ఫిజియో థెరపీ చేసుకున్నట్లయ్యింది. ఇప్పుడు నా శరీరం తేలికగా ఉంది’’ అన్నాడు. 

వెంటనే తండ్రి ‘‘గులాబీ తోటలోకి వెళ్ళిన కొందరు అందమైన గులాబీ పూలను చూస్తారు. మరికొందరు గులాబీ ముళ్ళను చూస్తారు. అలాగే మన జీవితాన్నీ, వృత్తినీ మనం చూసేదాన్ని బట్టి   ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే, చెడ్డగా ఆలోచిస్తే అంతా చెడ్డే’’ అన్నాడు. నాన్న చెప్పిన మాటల్లోని అంతరార్థం తెలుసుకున్న కొడుకులిద్దరూ లడ్డు తింటూ మనసులోనే గోవింద నామస్మరణలు చేస్తూ చిన్నగా గుడి బయటికి వచ్చారు.
– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు 
 

(చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..)

#

Tags : 1

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)