Breaking News

విశుద్ధి చక్ర నిలయా..!

Published on Thu, 09/11/2025 - 10:50

475వ నామం వద్ద అమ్మవారిని ‘విశుద్ధి చక్ర నిలయా‘ అనగా విశుద్ధి చక్రంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన సూక్ష్మ శరీరంలో కంఠం వద్ద ఉంటుంది. కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటునప్పుడు మనిషికి సంఘ జీవనం అలవడి, సాక్షీభూత స్థితిలో దైవికమైన చాతుర్యంతో మాట్లాడగల వాక్‌ శక్తి లభిస్తుంది.

103వ నామం వద్ద అమ్మవారిని ‘ఆజ్ఞా చక్రాంత రాళస్థా‘అనగా ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండునది అంటూ వర్ణిస్తారు. ఈ ఆజ్ఞాచక్రం మనం నుదురు మీద బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటినప్పుడు మనిషి లోపల క్షమాగుణం నెలకొని పరిపూర్ణ నిర్విచార స్థితి అనగా ఆలోచనలు లేని స్థితిని పొందుతాడు. సాధారణం గా మనిషికి ఆలోచనలు లేకుండా ఉండడం నిద్రలో మాత్రమే సాధ్యమవుతుంది. 

కానీ ఈ స్థితిని చేరుకున్న మనిషి మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆలోచనలు లేని స్థితిని పొందగలుగుతాడు. 105వ నామం వద్ద ‘సహస్రారాంబుజారూఢా‘ అనగా సహస్ర దళ పద్మంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన తల మీద మాడు ప్రాంతం లేదా బ్రహ్మ రంధ్రం వద్ద ఉంటుందని, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని ఛేదించుకొని పైకి వచ్చినప్పుడు మనిషికి యోగం లభిస్తుందని వివరిస్తారు. 

మానవ చేతన తన చుట్టూ ఉండే భగవంతుని పరమ చైతన్య శక్తితో అనుసంధానాన్ని పొందుతుందని, మానవ మెదడును లోపల నుండి గమనిస్తే, 1000 నరాలు కలిసి, 1000 దళాలు గల పద్మంలా  కన్పిస్తుందని, అందుకే ‘సహస్రారం’ అని పిలుస్తారని చెబుతారు. 106వ నామం వద్ద ‘సుధాసారాభి వర్షిణి’ అనగా అమృతధారలు కురిపించునది అని వర్ణిస్తారు. కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని దాటిన తరువాత చైతన్య తరంగాల అనుభూతి మొదలవుతుంది. అమృత ధారల వంటి ఈ చైతన్య తరంగాలను అనుభూతి చెందడం కుండలినీ జాగృతి వల్లే సాధ్యమవుతుంది. ఆ సమయంలో సాధకులు బ్రహ్మానందానుభూతిలో లీనమవుతారు.
– డా. పి. రాకేష్‌
పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా 

(చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)