Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్ మర్డర్
Breaking News
ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
Published on Wed, 09/17/2025 - 12:21
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..
ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.
సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారం
సెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారం
సెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం
సెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారం
సెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం
సెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం
సెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారం
సెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారం
సెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారం
అక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం
అక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం
గమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము.
(చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు)
Tags : 1