Breaking News

వెడ్డింగ్‌ డెస్టినేషన్స్‌ : సరస్సు నుంచి సముద్ర ద్వీపం వరకు

Published on Mon, 02/16/2026 - 15:58

జీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. ఇటలీలోని లేక్‌ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్‌ డ్రీమ్‌కు ప్రతిబింబంలా  కనిపిస్తా

విదేశీ వివాహ వేదికలు 

శాంటోరిని,  గ్రీస్‌: శాంటోరిని ద్వీపం తెల్లని గృహాలు, నీలి ఆకాశానికి ప్రసిద్ధి. సూర్యాస్తమ సమయంలో జరిగే వివాహం జీవితాంతం గుర్తుండే అనుభూతిగా మిగులుతుంది.

సువాసనల మధ్య వివాహం : ఫ్రాన్స్‌ దేశంలోని లావెండర్‌ పూల తోటల మధ్య జరిగే వివాహం ఒక స్వప్నంలా అనిపిస్తుంది. 

బీచ్‌లో కళ్యాణం: ఇండోనేషియా దేశంలోని బాలి ద్వీపం సముద్రతీరప్రాంతం ప్రకృతి వైభవానికి ప్రసిద్ధి. అలల శబ్దం, పచ్చని చెట్లు, సంప్రదాయ అలంకరణలు అన్నీ కలిసి ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇలా ప్రతి ప్రదేశం తన ప్రకృతి, చరిత్ర, సంస్కతితో వివాహాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్నిప్రారంభించడం ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. 

దక్షిణ భారత వివాహ వేడుకలు
ఈ మధ్య ట్రెండ్‌గా మారిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ లేదా ప్లాన్డ్‌ వెడ్డింగ్‌ ఇలా ప్రత్యేక ప్రదేశాల్లో పెళ్లి చేసుకోవడం కొత్త విషయం కాదు. దక్షిణ భారతంలో ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది.

గోపురం మధ్యలో మంగళ ధ్వని
తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో జరిగే వివాహం ఒక దివ్యానుభూతి. ఈ ఆలయం దక్షిణ భారత సంస్కృతికి ప్రతీక. సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటే ఆ వాతావరణం దివ్యానుభూతికి లోను చేస్తుంది. ఇక్కడ ఆలయ నిబంధనల ప్రకారం మాత్రమే వివాహాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆలయ అధికారులను సంప్రదించాలి.

దేవుని సొంత నేలలో: కేరళలోని కుమారాకోమ్‌లోని జలసరి నడుమ ప్రకృతి సాక్షిగా వివాహం జరుగుతుంది. ఈ ప్రాంతం కొబ్బరి చెట్లు, నీటి ప్రతిబింబాలు, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందింది.దక్షిణ భారత వివాహ వేదికలుజీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. ఇటలీలోని లేక్‌ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్‌ డ్రీమ్‌కు ప్రతిబింబంలా కనిపిస్తాయి.

కోట వైభవం సాక్షిగా: హైదరాబాద్‌లోని చౌమహల్లా  ప్యాలెస్‌లో రాజసంగా వివాహం నిర్వహించవచ్చు. హైదరాబాద్‌లోని ఈ రాజమహల్‌ నిజాం కాలపు వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడి వేడుకలకు ముందస్తు అనుమతులు అవసరం. 

ఇదీ చదవండి: వెడ్డింగ్‌ సీజన్‌ : కోటలో రాజసంగా వివాహం

ఊటి  అసలు పేరు తెలుసా?! 
మనమందరం సాదాసీదాగా ఊటి అని పిలిచే ఈ హిల్‌ స్టేషన్‌ అసలు పేరు ఉదగమండలం. ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాలి. ఉదగమండలం అనే పేరు తోడా అనే తెగల భాష నుంచి వచ్చిందని స్థానికులు చెబుతారు. ఒతకల్‌ మండు లేదా ఉదగై మండలం అనే పదానికి అర్థం పర్వతాల మధ్యలో ఉన్న గ్రామం. నీలగిరి పర్వత ప్రాంతంలో నివసించే తోడా తెగల వారికి ఇది పవిత్ర స్థలం. విదేశీ పాలనకు ముందు ఈ ప్రాంతంలో తోడా తెగలే నివసించేవారు. తర్వాత వారి ఉచ్చారణకు అనుగుణంగా పేరును మార్చుతూ చివరకు ఊటి అని ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ స్థానికులు ఇప్పటికీ ఉదగమండలం అనే పేరును గౌరవంగా ఉపయోగిస్తారు. తెలిమంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని తేయాకు తోటలు, ప్రశాంత వాతావరణం ఈ ప్రాంతానికి ఉదగమండలం అనే పేరు ఎంతో తగినదిగా అనిపిస్తుంది. 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)