Breaking News

Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే!

Published on Mon, 02/17/2025 - 17:13

దేశ రాజధాని నగరం ఢిల్లీని  భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం జనం భయంతో పరుగులుతీశారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు.  బలమైన ప్రకంపనలతో  చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సమయంలో ఇళ్ల బయట నిలబడి ఉన్న వ్యక్తులు వణుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు.

ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై చాలామంది ఆందోళనవ్యక్తం చేశారు . ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో  ఢిల్లీ  భూకంపంపై పలు మీమ్స్‌ను  సృష్టించారు.  #earthquake  హ్యష్‌ట్యాగ్‌తో  రూపొందించిన మీమ్స్‌   వైరల్‌గా మారాయి. ఢిల్లీలో నెలకొన్ని పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. పొద్దున్న  కాలుష్యం, సాయంత్రం గ్రహణం, రాత్రికి భూకంపం అంటూ నిరాశను ప్రకటించారు. 

#earthquake #Delhi 
earthquake to Delhi people: pic.twitter.com/vAYLFraIZo

 

— Yash Khandelwal (@yashk1140) February 17, 2025

ఢిల్లీలో జీవించడానికి  కావాల్సింది డబ్బులు కాదు భయ్యా, ముందు ధైర్యం కావాలి అంటూ  మీమ్‌ తయారు చేశారు. రెండు నెలలకోసారి  టెక్నో ప్లేట్స్‌ ఢిల్లీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ  డ్యాన్స్‌ వీడియోను పోస్ట్‌ చేశారు.  మరోవైపు  ఒక పక్క ప్రాణ భయంతో  ఢిల్లీ వాసులు అల్లాడిపోతే, సామాజిక మాధ్యమాల్లో కొందరు  నెటిజన్లు మీమ్స్‌ సృష్టిస్తూ కామెడీ చేయడం విమర్శలకు దారి తీసింది. 

 సాధారణంగా మీమ్స్‌ను జనాలకు వినోదం పండిస్తాయి.  మానసిక ఉల్లాసాన్నిస్తాయి.  చాలా తక్కువ సమయంలో  సంబంధిత సమాచారాన్ని చేరవేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల  వ్యవహార శైలిపై వేసే మీమ్స్‌ ఆలోచన రగిలిస్తాయి. క్రికెట్‌మ్యాచ్‌లు, సినిమా రివ్యూల్లో వచ్చే మీమ్స్‌ చేసే సందడి అంతా ఇంతా కాదు. చాలా క్రియేటివ్‌గా  ఉండే ఈ మీమ్స్‌ ఒకవైపు సమాచారాన్ని  ఇస్తూనే, మరోవైపు  బోలెడంత హాస్యాన్ని పండిస్తాయి.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)