Breaking News

డిజిటల్‌ యాప్స్‌ బంద్‌, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్‌

Published on Thu, 06/26/2025 - 13:08

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా (Anam Mirza) ఇక ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ చేసింది. అందరూ డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంపై తెగ మురిసిపోతోంటే...అదిమానేసి డబ్బు ఎలా ఆదా చేశానో తెలుపుతూ ఇన్‌స్టాలో ఒకపోస్ట్‌ పెట్టింది. అదెలాగో తెలిస్తే మీరు కూడా  ఔరా అంటారు. పదండి మరి అదేంటో  చూద్దాం.

అనమ్ మీర్జా సోషల్‌ మీడియాలో ఇపుడు ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే డబ్బులు ఏలా ఆదా చేయాలో యూత్‌కి ఒక  సీక్రెట్‌ మంత్రాను షేర్‌ చేసింది. యూపీఐ (UPI) యాప్స్‌ వాడటం పూర్తిగా ఆపివేసానని, రోజువారీ ఖర్చులను తగ్గించుకోవడానికి తన ఫోన్ నుండి Google Payని కూడా  డిలీట్‌ చేశానని వీడియోలో వివరించింది. QR కోడ్‌లను స్కాన్ చేయకుండా లేదా తక్షణ చెల్లింపులు చేయకుండా తనను తాను కట్టడి చేసుకున్నానని, తద్వారా బోలోడంత ఆదా చేశానని చెప్పుకొచ్చింది. ఫలితంగా తన డబ్బు ఎక్కడికి వెళుతుందో తనకు బాగా తెలిసిందని అనమ్  చెప్పింది.  తన సిరీస్ లిటిల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్ ఎపిసోడ్ 4లో ఈ  వీడియోను షేర్ చేసింది.

 మొదట్లో ఈ నిర్ణయానికి సర్దుబాటు చేసుకోవడం కష్టమనిపించింది.  స్నేహితులను కాఫీ కొనమని కూడా అడగాల్సి వచ్చింది కానీ కాలక్రమేణా,  ఆ మార్పుకు అలవాటు పడ్డానని, ఇప్పుడు చాలా  ఉపయోగకరంగా ఉందని వెల్లడించింది.

 

ఇదీ చదవండి: నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్‌గా

ఇది చూసి ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అనమ్‌పై ప్రశంసలు కురిపించారు. "ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది" అని  ఒకరు,  "ఈ కాలంలో నిజంగా గొప్ప మార్పు" అని మరొకరు, తాము కూడా ప్రయత్నించి, డబ్బు పొదుపు  చేస్తామని వ్యాఖ్యానించారు.

అయితే "మీరు ఇప్పటికే ధనవంతులు కాబట్టి ఇది మీకు సరిపోతుంది. మా లాంటి మధ్యతరగతి ప్రజలకు UPI ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అర్థం చేసుకోగలరు. అనవసరమైన ఖర్చులు చేసే ముందు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే  కానీ దానికోసం UPI ఖాతాను తొలగించడం సరైంది కాదంటూ మరో యూజర్‌ పెదవి విరవడం గమనార్హం. (మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్‌ : కానీ అంతలోనే!)

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)