Breaking News

సైలెంట్‌ డీ హైడ్రేషన్‌..! హెచ్చరిస్తున్న వైద్యులు

Published on Thu, 06/19/2025 - 10:53

‘మీకు డీహైడ్రేషన్‌ సమస్య ఉంది.. అనగానే చాలా మంది ‘నేను బాగానే నీరు తాగుతున్నా కదా అంటారు అయితే అది కొందరి అపోహ. నీరు మాత్రమే తాగితే సరిపోదు అని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ఆలివ్‌ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌ డా.అబ్దుల్‌ మజిద్‌ ఖాన్‌. నగరంలో వాతావరణ మార్పులకు అతీతంగా వేధిస్తున్న డీహైడ్రేషన్‌ సమస్య గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే.. 

ఎండలు మండే సీజన్‌లో డీహైడ్రేషన్‌ సమస్య గురించి తరచూ చర్చిస్తుండటం సహజం.. అయితే కాలాలకు అతీతంగా ఈ డీహైడ్రేషన్‌కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే ఉంటోంది అంటున్నారు భాగ్యనగరం వైద్యులు. దీనికి కారణాల్లో తగినంత నీరు తాగకపోవడం ప్రధాన కారణమైతే.. విభిన్న రకాల జీవనశైలి అలవాట్లు కూడా మరో కారణంగా చెబుతున్నారు. 

టీ, కాఫీ, ఆల్కహాల్‌ వంటి పానీయాలతో పాటు ఎనర్జీ డ్రింక్స్‌ కూడా శరీరంలో ద్రవనష్టాలకు కారణంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ సిటిజనుల్ని సైలెంట్‌ డీహైడ్రేషన్‌కి గురిచేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు సైతం డీహైడ్రేషన్‌ ముప్పును తెస్తున్నాయన్నారు.  

నీరు తాగితే చాలదు.. 
హైడ్రేషన్‌ అంటే కోల్పోయిన నీటిని పొందడం మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే శరీరం ద్రవాలను మాత్రమే కాకుండా, మరిన్నింటిని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుందని అంటున్నారు వైద్యులు. దీనినే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రొలైట్స్, ఎనర్జీ(ఎఫ్‌ఇఇ) ఈక్వేషన్‌ అని పిలుస్తారు. 

ఉక్కపోత నుంచి అతి వ్యాయమం వరకూ.. వీటి వల్ల శరీరం సోడియం, పొటాషియం, మెగ్నిషియం మొదలైన ఎలక్ట్రోలైట్‌లను గ్లూకోజ్‌ను కోల్పోతుంది. గుండె లయ, నరాల సంకేతాలు, కండరాల కదలిక మానసిక ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే కేవలం కోల్పోయిన నీటి భర్తీ వల్ల ఈ సమతుల్యత పునరుద్ధరించడం జరగదు. సాదా నీటిపై మాత్రమే ఆధారపడి ఊరుకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది.  

ఆహారమూ కీలకమే.. 
మన ఆహారంలో తరచూ ఊరగాయలు, పాపడ్స్‌ ఉప్పగా ఉండే స్నాక్స్‌ ఉంటాయి. అవి కూడా ద్రవనష్టానికి దారి తీస్తాయి. కండరాల సంకోచాలు, నరాల పనితీరు హైడ్రేషన్‌ను నియంత్రించడానికి కీలకమైన ఖనిజం పొటాషియం. మన దేశంలో పోషకాహార ధోరణులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరికి పొటాషియం లోపం ఉంది. 

వేసవిలో  పొటాషియం, సోడియం అసమతుల్యత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, పప్పులు, నారింజ లేత కొబ్బరి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను అత్యంత తక్కువగా తీసుకుంటారు. ఐసిఎంఆర్‌ ప్రకారం, ఈ ఆహారాలు మన ఉత్తమ సహజ వనరులు అని గుర్తించింది.  

సూచనలు: 

ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ గ్లూకోజ్‌. మూడింటి మేళవింపుగా లభించే రెడీ–టు–డ్రింక్‌ ఎలక్ట్రోలైట్‌ సొల్యూషన్స్‌ ఆదరణ పొందుతున్నాయి. సరైనవి ఎంచుకోవచ్చు.  

డీహైడ్రేటింగ్‌కు కారణమయ్యే టీ, కాఫీ వంటి కెఫిన్‌ కలిగిన పానీయాలు, అలాగే ఆల్కహాల్, ఎరేటెడ్‌ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవడం తగ్గించండి.  

డీహైడ్రేషన్‌ వల్ల కండరాల తిమ్మిరి, నోరు పొడిబారడం, తలనొప్పి, అలసట లేదా మైకం లాంటివి కలుగుతుంటే విస్మరించవద్దు. వెంటనే లవణాలు గ్లూకోజ్‌ రెండింటినీ కలిగి ఉన్న హైడ్రేషన్‌ ద్రావణాన్ని తీసుకోండి 

విరేచనాలు వంటి తీవ్ర లక్షణాలు లేకుండానే శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని నిశ్శబ్ద డీహైడ్రేషన్‌ అని పిలుస్తారు.
– డా.అబ్దుల్‌ మజిద్‌ ఖాన్, కన్సల్టెంట్‌ ఫిజీషియన్, ఆలివ్‌ హాస్పిటల్‌  

(చదవండి: '4ఏ మోడల్‌'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!)

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)