Breaking News

అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్‌

Published on Tue, 06/24/2025 - 11:04

భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన  ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్‌లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్‌ చేయడం విమర్శలకు తావిచ్చింది.


AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా  విమానాశ్రయ సేవలు , ఫుడ్‌ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న  జాయింట్ వెంచర్‌ ఇది.

ఎయిర్ ఇండియా SATS (AISATS)  సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి  పార్టీ చేసుకోవడం  దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే,  ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు,   యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ  కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. 

 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని  ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా  మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్‌ చేసి ఎయిరిండియా ఇమేజ్‌ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది,  ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)