Breaking News

నాణేల సంచితో షోరూమ్‌కి రైతు.. కూతురి కోసం ఎంత తాపత్రయం!

Published on Thu, 10/23/2025 - 14:00

ఓ త్రండి ఆర్థిక సామర్థ్యానికి మించి కుమార్తె ఓ కోరిక కోరితే.. నా వల్ల అవుతుందా అని నిస్సహాయతను వ్యక్తం చేయలేదాయన. నా రాకుమారి కోసం ఎలాగైనా చేయాలి అనుకున్నాడు  ఆ నాన్నా. అది తన తాహతుకు, శక్తికి మించిన పని అని తెలిసినా.. అజేయమైన దృఢ సంకల్పంతో తీర్చేందుకు ప్రయత్నించిన అతడి కథ ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది.

ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. బజరంగ్‌ రామ్‌ అనే రైతు కూతురు లక్షరూపాయ ఖరీదు చేసే స్కూటర్‌ కావాలని కోరింది. అది అతడి ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం అతడికి అనితరసాధ్యమైనది కూడా. అయినా సరే ప్రతి రూపాయి వెనకేస్తూ.. ఏదోనాటికి కూతురి కల నెరవేర్చాలంటూ తనకు చేతనైనంతా చేయడం ప్రారంభించాడు. 

తన సంపాదనలో మిగిలిని నాణేలన్నీ బాక్స్‌లో వేస్తూ..కొంత సొమ్ము పోగుచేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి..తాను స్కూటర్‌ కొనాలనుకుంటున్నా అంటూ..ఆ నాణేల సంచిని వారిముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరిక కోరిందటూ ఆ నాణేల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూమ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ గుప్తాను మనసుని కదిలించింది. 

కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టేవారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి..ఆ సంచిలోని నాణేలన్నింటిని తన సిబ్బందితో లెక్కించారు. అవి మొత్తం రూ. 40,000 అని చెప్పగా. మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్‌ తీసుకుంటానని అన్నాడు బజరంగా రామ్‌.  అందుకు సంబంధించిన ఆ పేపర్‌ పని పూర్తిచేశాడు. 

ఆ తర్వాత షోరూం డైరెక్టర్‌ గుప్తా బజరంగ్‌ రామ్‌ కుటుంబానికి ఆహ్వానం పలికి. టీ సర్వ్‌ చేసి మరి సరికొత్త హోండా యాక్టివా కీను అందజేశారు. బజరంగ్‌ బండిని స్టార్ట్‌ చేసినప్పుడూ కూతురు చంపా కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆమె కన్నీళ్లతో ఇది కేవలం స్కూటర్‌ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామె.

(చదవండి: ఆ ప్రొఫెసర్‌కు 150 ప్లస్‌ డిగ్రీలు..అమ్మ చెప్పిందని..!)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)