పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

Published on Wed, 06/17/2026 - 16:37

అప్పటి వరకు గృహిణిగా గడిపిన ఆమె పారిశ్రామికవేత్తగా మారడం అంటే సాధారణ విషయం కాదు. కానీ ఒక మహిళ తలుచుకుంటే లక్ష్యాన్ని సాధించకుండా ఏది ఆపలేదు అనేందుకు ఉదాహరణగా మారింది గుజరాత్‌కు చెందిన ఈ గృహిణి. అంతేగాదు ఆమె గ్రామీణ భారతదేశంలోని మహిళ పారిశ్రామికవేత్తకు ప్రతీకగా నిలిచించి. ఇంటి పనులు నిర్వహిస్తూనే పశువుల సంరక్షణతో కోట్లాది రూపాయాలు ఆర్జిస్తోందామె.

గుజరాత్‌కు చెందిన దర్యాబెన్‌కు 18 ఏళ్లకే వివాహమైంది. ఆ తర్వాత అత్తగారింట్లో గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. తన అత్తమామలకు చేదోడు వాదుడుగా ఉంటూ.. పశువుల సంరక్షణ కూడా చూసుకుంటూ ఉండేది. అలా దర్యాబెన్‌ డైరీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. కాలక్రమేణ తాను దాంతోనే వ్యాపారాన్ని నిర్మిస్తానని అనుకోలేదు. మొదట్లో పశువుల పోషణ, పాలు సేకరించడం వరకే చూశారామె. 

తన వంతు ఇంటికి సహాయపడదామనే ఉద్దేశ్యంతో పశువుల సంరక్షణనే వ్యాపారంగా మార్చుకుంది. అలా చిన్న డైరీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. అందుకోసం పాల ఉత్పత్తిని మెరుగుపరిచింది. ఆ తర్వాత ఇంట్లో ఉండే కొన్ని పశువుల సంఖ్యను కూడా పెంచి అనతి కాలంలోనే అతిపెద్ద డైరీగా మార్చింది. ప్రస్తుతం ఆమె వద్ద సుమారు 200 గేదెలు, 100 ఆవులు, వెరసి మొత్తం 300 పశువులు ఉన్నాయి. అంతేగాదు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి 14 మంది కార్మికులను కూడా నియమించుకుంది. 

ఆమె రోజు ఉదయం 3.30 గంటలకు పాలు సేకరించడంతో మొదలై ఫామ్‌ నిర్వహణకు సంబంధించిన పనులతో పూర్తవుతోంది. ప్రతిరోజు సుమారు వెయ్యిలీటర్లపైనే పాలు బనస్‌ డైరీకి సరఫరా చేసేది. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా నెలకు సుమారు రూ. 20 లక్షల పైనే చొప్పున ఏటా ఏకంగా రూ. 1.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందామె. ఇక్కడ 48 ఏళ్ల దర్యాబెన్‌ పాడి పరిశ్రమను సొంతం చేసుకోవడమే కాకుండా సమర్థవంతమైన నిర్వహణ, పాల ఉత్పత్తి వ్యూహాలు, పాడి సహకార సంఘాల నెట్‌వర్క్‌తో బలమైన అనుసంధానం తదితరాలతో మంచి విజయం అందుకుంది. 

ఇక బనాస్‌ డైరీ గుజరాత్‌లోనే అతిపెద్ద పాడి సహకార సంఘాల నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది లక్షలాదిమంది పాల ఉత్పత్తిదారులతో అనుసంధానమై ఉంది. ఈ డైరీ రైతులకు క్రమం తప్పని చెల్లింపులు, సాంకేతిక మార్గదర్శకత్వం, నమ్మకమైన మార్కెట్‌ సదుపాయం అందించి గ్రామీణ ఆదాయాలను గణనీయం పెంచడంలో సహాయపడుతుండటం విశేషం. అంతేగాదు ఎంతోమంది మహిళలను పారిశామ్రికవేత్తలుగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అలా లబ్ధి పొందిన అనేకమంది మహిళల్లో దర్యాబెన్‌ కూడా ఒకరు. ఒకరకంగా ఇది గ్రామీణ పాంతంలోని మహిళలు కేవలం ఇంటి పనులకు, పశువులను చూసుకోవడానికే పరిమితం కాదని ఈ డైరీ నిరూపించింది కదూ. 

(చదవండి: ఏరోస్పేస్‌ ఉద్యోగాన్ని వదిలి కేఫ్‌..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..)
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)