Breaking News

ఆలీవ్‌ ఆసుపత్రి ఆధ్యర్యంలో సీపీఆర్‌పై ప్రత్యేక శిక్షణ

Published on Fri, 01/31/2025 - 15:56

హైదరాబాద్, జనవరి 31 2025 : గుండె జబ్బుల నుంచి ఆపత్కాలంలో బయటపడేసి, ప్రాణాలను నిలిపే అద్భుతమైన వైద్య ప్రక్రియ అయిన కార్డియో పల్మోనరీ రిససిటేషన్(సీపీఆర్)పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.కృతిక్ కులకర్ణి అన్నారు. అందుకు ఆలివ్ హాస్పిటల్ ఆధ్యర్యంలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టిందనీ, సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. సడెన్ హార్ట్ ఎటాక్ బారినపడిన సందర్భంలో ఈ ప్రక్రియతో ప్రాణాలను నిలపవచ్చన్నారు. విశ్వసనీయమైన వైద్య సేవలతో, ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలతో పేరుగాంచిన ఆలివ్ హాస్పిటల్ ఈ తరహా కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. రోగి ప్రాణాలను కాపాడటంలో సీపీఆర్ సమర్థవంతమైన వైద్య ప్రక్రియ అని, ఈ విషయంపై ప్రతి ఒక్కరు నైపుణ్యత సాధించాల్సిన అవసరం ఉందని డా. కృతిక్ స్పష్టం చేశారు. 

CPRతో కార్డియాక్ ఎమర్జెన్సీ సమయంలో వైద్య సేవలు అందించేలా పౌరులకు అవగాహన కల్పించడమే శిక్షణ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఛాతీపై అరచేతుల సాయంతో ఒత్తిడి ప్రయోగిస్తూ... శ్వాస ప్రక్రియను పునరుద్ధరించాల్సి ఉంటుందన్నారు. దీంతో అవయవాలకు రక్త సరఫరా జరిగి ప్రాణాపాయం తప్పుతుందన్నారు. సీపీఆర్ ద్వారా జీవక్రియలు మూడు రెట్ల వేగంతో జరుగుతాయని పలు అధ్యయనాలు నిరూపితమైంది. కానీ దేశంలో సీపీఆర్‌పై పౌర సమాజానికి అవగాహన లేదని, నైపుణ్యాలను పెంపొందించడమే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.

"CPR  అనేది ముఖ్యమైన నైపుణ్యం. ఇదీ జీవ విధానంలో నిత్యం చేసుకునే ప్రక్రియల కంటే ఎంతో ముఖ్యమైనదని  సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.కృతిక్ కులకర్ణి అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి సీపీఆర్ శిక్షణను అందించడం ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను కాపావచ్చన్నారు.  అందుకే ఎంతో ముఖ్యమైన సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. CPR ప్రాథమిక అంశాలను మరింత తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆన్‌లైన్ సమాచార, సోషల్ మీడియా మాధ్యమాలను వినియోగించుకునేలా ఆలీవ్ హాస్పిటల్ కృషి చేస్తుందన్నారు. 

ఇదీ చదవండి: పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్‌ అదుర్స్‌


 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)