Breaking News

ఆ దేశానికి ఎయిర్‌పోర్ట్‌, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్‌లోనే అత్యంత ధనిక దేశం..

Published on Mon, 10/27/2025 - 13:30

ఒక దేశ సామర్థ్యాన్ని సైనికబలం, ఆర్థిక స్వాతంత్య్రం వంటివాటిని కొలమానంగా చేసుకుని అంచనా వేస్తారు. ప్రధానంగా చూసేవి వాటినే. కానీ ఈ దేశానికి అవేమి లేకపోయినా..సుసంపన్నమైన దేశంగా కీర్తిగడిస్తుంది, పైగా ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరు గడిస్తోంది. ఒక దేశం గొప్పతనాన్ని తెలిపే, అంతర్జాతీయ విమానాశ్రయం , సొంత కరెన్సీ లేని ఈ దేశం ఎలా అత్యంత ధనిక దేశం పేరు గడించిందో తెలిస్తే విస్తుపోతారు. ప్రతిదీ సృష్టించి భుజాలు ఎగరువేయడం కాదు..పరిమిత వనరులనే ఉత్తమంగా ఉపయోగించుకుంటే.. అత్యంత సంపన్న దేశంగా అవతరించొచ్చని చాటిచెబుతోంది ఈ దేశం. 

ఆ దేశమే చిన్న యూరోపియన్ దేశం లీక్టెన్‌స్టీన్(Liechtenstein). ప్రపంచంలోని అత్యంత స్థిరమైన సంపన్నదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ దేశం సొంత కరెన్సీని కూడా ముంద్రించదు, పైగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. మరి సంపన్న దేశంగా ఎలా పేరుగడిస్తోందంటే..

చాలా దేశాలు తమ సార్వభౌమాధికార చిహ్నాలైనా..కరెన్సీ, భాష, జాతీయ విమానాయన సంస్థ వంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కానీ లీక్టెన్‌స్టీన్ అందుకు విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. అప్పుతో కూడా సమర్థవంగా నిర్ణయించొచ్చని ప్రూవ్‌ చేస్తూ..స్విస్‌ ఫ్రాంక్‌ని అధికారిక కరెన్సీగా స్వీకరించింది. 

దాంతోనే బలమైన స్థిరమైన ఆర్థిక నిర్మాణానికి అంకురార్పణ వేసింది. ఫలితంగా కేంద్రబ్యాంకు అవసరం, కరెన్సీ నిర్వహణ భారం పడకుండా చేసుకుంది. అదేవిధంగా ఎయిర్‌పోర్టుల బదులుగా  స్విట్జర్లాండ్, ఆస్ట్రియా రవాణా నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని, బిలియన్ల డాలర్లను ఆదా చేస్తోంది. 

అదే ఈ దేశం బలం..
పరిశ్రమ, ఆవిష్కరణలే ఈ దేశం బలాలు. దంత వైద్యంలో ఉపయోగించే మైక్రో-డ్రిల్‌ల నుంచి ఏరోస్పేస్ టెక్నాలజీ, ఆటోమొబైల్‌ బాగాల వరకు ప్రతిదాన్ని ఉత్పత్తి చేస్తూ ఇంజీనీరింగ్‌ పరికరాల ఉత్పత్తిలలో అగ్రగామిగా రాజ్యమేలుతోంది. అంతేగాదు నిర్మాణ పరికరాల్లో ప్రపంచ నాయకుడైన హిల్టి ఆ దేశ పారిశ్రామిక బలానికి ప్రధాన చిహ్నం. 

ఇక్కడ చాలామటుకు రిజిస్టర్డ్‌ కంపెనీలే ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే..జనాభా కంటే రిజిస్టర్డ్‌ సంస్థలే చాలా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నిరుద్యోగం అనేదే కనిపించదు. అదీగాక పౌరుల ఆదాయాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి.  అంటే పేదవాడనే వాడే ఉండడు. ఇక్కడ జనాభా కూడా అత్యంత తక్కువే కేవలం 40 వేల మందే. 

రుణ, నేర రహిత దేశం..
ఈ దేశంలో దాదాపు అప్పులనేవి ఉండవు, ప్రభుత్వ ఆదాయంలోని మిగులుతూనే దేశాన్ని నడిపిస్తుంది. మరో విశేషం ఏంటంటే..ఇక్కడ కొద్దిమంది ఖైదీలే ఉంటారట. అంతేగాదు ఈ దేశంలోని పౌరులు రాత్రిళ్లు ఇళ్లకు తాళలు కూడా వేయరట. 

ఇది ఆదేశ భద్రదా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేస్తోంది. పైగా ఇలా నిర్భయంగా బతకడంలోనే అసలైన జీవితం ఉందని ఈ ఆ దేశం తన చేతలతో నిరూపిస్తోంది.  ఈ దేశం కేవలం సంపదకు చిహ్నం మాత్రమే కాదు, అత్యున్నత ‍స్థాయి, భద్రత, శాంతి వంటి వాటికి చిరునామా అని కీర్తిస్తున్నారు పలువురు. 

(చదవండి: ‘విలేజ్‌ హాలోవీన్‌ పరేడ్‌’కి వెళ్లాలంటే..గట్స్‌ ఉండాలి..!)
 

Videos

అంబాలా ఎయిర్ బేస్ లో రాష్ట్రపతి ముర్ము సాహసం!

భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక

Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి

APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు

డ్రగ్స్ మాఫియాపై ఎటాక్.. 64 మంది మృతి..

Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు

బాబు వద్దనుకున్న గ్రామ సచివాలయ సిబ్బందే కీలక పాత్ర పోషించారు..

Jains Nani: ప్రొడ్యూసర్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు

టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ని బయటపెట్టిన శైలజానాథ్

ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు

Photos

+5

ఒంటరిగా మాల్దీవులు టూర్‌లో నమ్రత (ఫొటోలు)

+5

నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్‌ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్‌ (ఫొటోలు)

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)