Breaking News

అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాయ్‌..! కానీ 17 కిలోమీటర్లు..

Published on Tue, 03/24/2026 - 16:13

మనుషులే కాదు జంతువులు కూడా తమ ప్రాణాలు కోసం ఎంతలా పోరాడతాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. సినిమాని తలపించే ట్విస్ట్‌లు, ఛేజ్‌లతో ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ పెంపుడు కుక్కల కథ వింటే..విస్తుపోతారు. అంతేగాదు ఇది నిజంగా జరిగిందా అని ఆశ్చర్యం కలుగకమానదు. 

అసలేం జరిగిందంటే..చైనాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. చైనాలోని ఓ ఏడు పెంపుడు కుక్కలు..తమ ప్రాణాలను రక్షించుకోవడానికి చేసిన సాహనం నెట్టింట వైరల్‌గా మారి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆ ఏడు కుక్కలు..కుక్కల మాంసం విక్రయించే కొందరు వ్యక్తుల ముఠా నుంచి చాలా తెలివిగా తప్పించుకున్నాయి. ఓ ట్రక్కు సాయంతో తీసుకుపోతున్న ఆ వ్యక్తుల బారీ నుంచి చాలా తెలివిగా బయటపడటమే కాకుండా..అవి ఒక బృందంగా వచ్చిన తీరు అమితంగా ఆకట్టుకుంటుంది. 

ఆ కుక్కలను ఒకతాటిపై నడిపించేలే కోర్గి జాతీ కుక్క నాయకత్వం వహించగా మిగతా కుక్కలా దాని బాటలో నడవడం గమనార్హం. హైవేల మీదుగా..సుమారు 17 కిలోమీటర్లు నడిచి తమ ఓనర్‌ ఇంటికి నేరుగా వచ్చేశాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

అయితే వాటిలో ఒక జర్నమ్‌ షెపర్డ్‌ కుక్క గాయపడగా..దానికి రక్షణ కల్పించేలా గుంపుగా నిలబడి హైవేల గుండా జాగ్రత్తగా రోడ్డుదాటుతూ తమ ఇంటికి తిరిగి వెళ్లిపోవడం విశేషం. అయితే స్థానికులు మాత్రం అవన్నీ ఎక్కడకు వెళ్లినా..కలిసే వెళ్తాయని వెల్లడించడం గమనార్హం.

 

(చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!)

 

#

Tags : 1

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)