కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..

Published on Mon, 06/30/2025 - 17:40

కళ కోసం తపించే మహానుభావులెందరినో చూశాం. తమ సర్వస్వం దానికే అర్పించి..భావితరాలకు వాటి గొప్పతనం తెలియజేసిన మహానుభావులెందరో ఉన్నారు. అయితే ఇక్కడొక పోలీసు అంతలా కాకపోయినా..చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు కళకారుడిగా మారిన కథ ఇది. కుటుంబ భాద్యతల నడుమ మరుగున పడ్డ తన కలకు ప్రాణం పోసి శెభాష్‌ అనిపించుకుంటున్నాడు.

అతడే కర్ణాటకకు చెందని పోలీసు బి ఎస్ శివరాజు. ఆయన తన తల్లి గౌరమ్మతో కలిసి ఒక్కఫోటో కూడా దిగలేదు. తన స్నేహితులు, బంధువులు ఇంటికి వెళ్లినప్పుడూ..గోడలపై కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు చూసి కలత చెందేవాడు. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుంటూ శివ..తన తాత తనను, తన తల్లిని తీసుకుని ఫోటోస్టూడియోకి తీసుకువెళ్లి..ఫోటో తీయించుకోకుండానే బాధగా ఎలా వెనుతిరిగి వచ్చిందో చెప్పుకొచ్చాడు. 

ఎందుకంటే అప్పటి తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం, పైగా స్టూడియో అతను తక్కువ డబ్బులకు తీయడం కుదరదనడంతో నాటి ఫోటో ముచ్చట నీరుగారిపోయిందని బాధగా చెప్పుకొచ్చాడు శివ. ఆ విధంగా ఫోటో తీసుకోలేకపోయిన వెలితి శివ మనసులో అలానే బలంగా ఉండిపోవడంతో..2017లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకుని..ఆల్బమ్‌లు డాక్యుమెంటేషన్‌ చేస్తున్నాడు. 

ఈ పనిని ఆయన తన తల్లి రగౌరమ్మతో కలిస చేస్తుండటం విశేషం. బాల్యంలో అమ్మతో కలిసి ఫోటో దిగలేకపోయిన లోటుని ఇలా భర్తీ చేసుకుంటున్నాడు శివ. ప్రస్తుతం బెంగళూరులో  జాషువా ముయివా నిర్వహిస్తున్న నో లాంగర్ ఎ మెమరీ, పాతకాలపు స్టూడియో-షాట్ ఫోటో ఆల్బమ్‌ల నోస్టాల్జియా గ్యాలరీ సుముఖ ప్రదర్శనలో  అతడి ఫోటో డాక్యుమెంట్లు సందడి చేస్తున్నాయి.  ఆ ఫోటోల ఆల్బమ్‌లన్నింటిల్లోనూ తన తల్లితో కలసి రకరకాల వేషాల్లో కనిపిస్తాడు.

ప్రతి ఒక్క ఫోటో అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుంది. సెల్‌ఫోన్‌లు, కెమెరాలు లేని ఫోటో స్టూడియా ముచ్చట్లు కదలాడేలా ఆ గ్యాలరీ ప్రదర్శన ఉంటుంది. ఆ ఆల్బమ్‌ని శివ ప్రాణం పెట్టి తీర్చిదిద్దాడు. 21 ఏళ్లకు పోలీసు ఉద్యోగం సంపాదించాడు శివ. సహజంగా ఆ వృత్తిపరంగా టెన్షన్‌తో కూడిన కాఠిన్యం ఎక్కడ శివ ముఖంలో మచ్చుకైన కానిరాని విధంగా ఆ ఫోటోల్లో కనిపిచడం విశేషం. 

ఇలా ఈ కళను ఎంచుకోవడానికి కారణాన్ని కూడా వివరించాడు శివ. "నాటక సంప్రదాయం అంతరించిపోతోంది. ప్రస్తుత వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఫోటో స్టూడియోలు గతంలో ఉన్నట్లుగా లేవు. అందువల్ల నేను నా జ్ఞాపకాలతో, నా ప్రజలతో, నా సంస్కృతితో పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఒకరకంగా  నా జీవితంలోకి తిరిగి వచ్చిన ఫీల్‌ని అందిస్తోంది. ఇంకా ఇలాంటివి మరిన్ని డాక్యుమెంట్‌లు చేయాలి అదే తన ఆకాంక్ష అని నవ్వుతూ చెబుతున్నాడు". ఈ మాజీ పోలీస్‌ శివ.

(చదవండి: 'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్‌ బోర్డుల నుంచి...)

 

Videos

ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఆల్ ఖైదా టెర్రరిస్టులు

వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్

పచ్చ బ్యాచ్ మొత్తం దొరికిపోయారు.. సింగయ్య మృతిలో ట్విస్ట్

ఎల్లుండే మెగా సునామీ?

భారత్ కి అపాచీ యుద్ద హెలికాప్టర్లు వచ్చేస్తున్నాయ్ !

కళ్లకు గంతలు కట్టి.. కత్తితో పొడిచి తండ్రిని హతమార్చిన కుమారుడు

సింగయ్య మృతిపై బయటికొస్తున్న నిజాలు టెన్షన్ లో బాబు, లోకేష్

కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను ఎండగట్టిన హైకోర్టు

Pashamylaram Blast: శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

ఏపీలో ఉద్యోగం చేయాలంటేనే బెదిరిపోతోన్న ఐఏఎస్, ఐపీఎస్ లు

Photos

+5

నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)

+5

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!